Homeక్రీడలుUnder 19 World Cup: న్యూజిలాండ్‌కు చుచ్చుపోయించిన ముషీర్, సౌమీ పాండే.. యంగ్‌ టీమిండియా మామూలుగా...

Under 19 World Cup: న్యూజిలాండ్‌కు చుచ్చుపోయించిన ముషీర్, సౌమీ పాండే.. యంగ్‌ టీమిండియా మామూలుగా లేదుగా

Under 19 World Cup: ఐసీసీ అండర్‌ –19 పురుషుల వరల్డ్‌ కప్‌లో యువ భారత్‌ జోరు కొనసాగుతోంది. టోర్నీలో వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. న్యూజిలాండ్‌తో మంగళవారం (జనవరి30న) జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఏకంగా 214 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యార్‌లో ముషీర్‌ ఖాన్‌ సెంచరీతో చెలరేగగా, సామీ పాండే బంతితో చెలరేగాడు. దీంతో భారత్‌ చేతిలో న్యూజిలాండ్‌ చిత్తయింది. దీంతో భారత్‌కు సెమీస్‌ బెర్తు దాదాపు ఖరారైంది.

టాస్‌ ఓడి..
సూపర్‌ – 6లో భాగంగా భారత్‌ తన నాలుగో మ్యాచ్‌ న్యూజిలాండ్‌తో తలపడింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌ దిగిన
భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. ముషీర్‌ ఖాన్‌(131) బ్యాట్‌ ఝళిపించి సెంచరీ నమోదు చేశాడు. ఆదర్శ్‌ సింగ్‌ (52) హాఫ్‌ సెంచరీ చేశాడు. భారీ లక్ష్యాన్నిన్యూజిలాండ్‌ ముందు ఉంచింది.

లక్ష్య ఛేదనలో చతికిల..
296 పరుగుల భారీ టార్గెట్‌లో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ భారత బౌలర్ల ధాటికి చతికిలపడింది. ఏ దశలోనూ పోరాట పటిమ కనబర్చలేదు. కేవలం 28.1 ఓవర్లలో 81 పరుగులకే ఆల్‌ఔట్‌ అయింది. స్పిన్నర్‌ సామీ పాండే మాయలో చిక్కుకున్న కివీస్‌ బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌ బాట పట్టారు. న్యూజిలాండ్‌ కెప్టెన్‌ ఆస్కార్‌ జాక్సన్‌(19) మాత్రమే అత్యధిక స్కోరు. జాన్‌ కమ్మింగ్‌(16), అలెక్స్‌(12), జేమ్స్‌ నెల్సన్‌(10) మాత్రమే డబుల్‌ డిజిన్‌ స్కోరు చేశారు. ముగ్గురు సింగిల్‌ డిజిట్‌ పరుగులు చేయగా, ముగ్గురు డక్‌ ఔట్‌ అయ్యారు. సామీ పాండే 19 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు. అటు వ్యాట్‌లో ముషీర్‌ఖాన్, ఇటు బాల్‌తో సామీ పాండే న్యూజిలాండ్‌కు చుచ్చుపోయించారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version