IND VS BAN Test Match : సొంత గడ్డపై టీమిండియా జైత్రయాత్ర.. బంగ్లాదేశ్ కు భంగపాటు.. ఉత్కంఠమైన మలుపులు తిరిగినా కాన్పూర్ టెస్టూ రోహిత్ సేనదే..

సొంత గడ్డపై టీమిండియా సంచలనం సృష్టించింది. పాకిస్తాన్ జట్టును 2-0 తేడాతో ఓడించి, విజయ గర్వంతో భారత గడ్డపై అడుగుపెట్టిన బంగ్లాదేశ్ ను నేల నాకించింది. రెండు టెస్టుల సిరీస్ ను 2-0 తేడాతో గెలిచి.. స్వదేశంలో తాము ఎంత బలవంతులమో టీమిండియా నిరూపించింది.

Written By: Anabothula Bhaskar, Updated On : October 1, 2024 4:24 pm

IND VS BAN Test Match

Follow us on

IND VS BAN Test Match :  కాన్పూర్ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్ ఏడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ జట్టుపై విజయం సాధించింది. ఈ వేదికపై వర్షం కురవడం వల్ల దాదాపు రెండు రోజుల ఆట తుడిచిపెట్టుకుపోయింది. దీంతో ఎలాగైనా గెలవాలని ఉద్దేశంతో టీమ్ ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ సరికొత్త వ్యూహాలు అమలు చేశారు. వారి వ్యూహాలకు తగ్గట్టుగానే మిగతా ఆటగాళ్లు రాణించారు. ఫలితంగా బంగ్లాదేశ్ జట్టు భారత క్రికెటర్ల ఆట తీరు ముందు తలవంచాల్సి వచ్చింది. భారత క్రీడాకారుడు అసాధారణ ప్రదర్శన చేయడంతో టీమిండియా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. రెండవ ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ కుప్పకూలడంతో.. టీమిండియా ఎదుట 95 పరుగుల విజయ లక్ష్యం మాత్రమే ఉంచింది. దానిని భారత్ మూడు వికెట్ల కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ 8, గిల్ 6 నిరాశపరిచినప్పటికీ.. యశస్వి జైస్వాల్ 51 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. విన్నింగ్ షాట్ కోసం ప్రయత్నించి జైపాల్ అవుట్ కాగా.. రిషబ్ పంత్ సహాయంతో విరాట్ కోహ్లీ (25*) భారత జట్టు విజయలాంచనాన్ని పూర్తి చేశాడు.

అంతకుముందు బంగ్లాదేశ్ జట్టు 26/2 తో చివరి రోజు ఆటను మొదలుపెట్టింది. మొత్తంగా 146 పరుగులకు కుప్ప కూడింది. తొలి సెషన్ లో నే బంగ్లా ఇన్నింగ్స్ ముగించాలని భారత బౌలర్లు అనుకున్నారు. వారిపై కోచ్, కెప్టెన్ భారీ ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలకు తగ్గట్టుగానే భారత బౌలర్లు బౌలింగ్ వేశారు. ముఖ్యంగా రవిచంద్రన్ అశ్విన్, బుమ్రా, రవీంద్ర జడేజా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. వీరు ముగ్గురు తలా మూడు వికెట్లు దక్కించుకున్నారు.. ఆకాష్ దీపు ఒక వికెట్ సొంతం చేసుకున్నాడు. బంగ్లాదేశ్ ఆటగాళ్లలో ఇస్లాం 50 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ముష్ఫికర్ రహీం భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతడు 63 బంతుల్లో 37 పరుగులు చేశాడు. వికెట్ కోల్పోకుండా గోడ లాగా ఆడాడు. దీంతో తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ కు 52 పరుగుల లీడ్ లభించింది. ఆ తర్వాత భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో బంగ్లా బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు. దీంతో టీమ్ ఇండియా ఎదుట 95 పరుగుల లక్ష్యం మాత్రమే బంగ్లాదేశ్ నిర్దేశించగలిగింది.

ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ ముందుగా బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్ లో 233 రన్స్ కు ఆల్ అవుట్ అయింది. హక్ 107* పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.. బుమ్రా మూడు వికెట్లు పడగొట్టాడు. సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాష్ దీప్ తలా రెండు వికెట్లు దక్కించుకున్నారు. జడేజా ఒక వికెట్ పడగొట్టాడు. అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్ ఆడింది. 285/9 వద్ద డిక్లేర్ చేసింది. అయితే వ్యూహాత్మకంగా భారత ఆటగాళ్లు t20 తరహాలో బ్యాటింగ్ చేశారు. రన్ రేట్ 7 కు తగ్గకుండా పరుగులు చేశారు.. కేవలం 34.4 ఓవర్లలోనే 285 పరుగులు చేశారంటే భారత ఆటగాళ్లు ఏ స్థాయిలో బ్యాటింగ్ చేశారో అర్థం చేసుకోవచ్చు.