Heroes : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి కొంతమందికి మాత్రమే ఇక్కడ చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ప్రస్తుతం మన హీరోలందరూ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకంటు ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నారు అయితే ప్రతి ఒక్క హీరో భారీ సక్సెస్ లో సాధించడమే కాకుండా వాళ్ళ కెరియర్ లో భారీ డిజాస్టర్ ను మూటకట్టుకున్న సినిమాలు సైతం ఉన్నాయి. ఆ సినిమాలు ఏంటి ఏ హీరో ఎన్ని సినిమాలతో బ్యాడ్ నేమ్ సంపాదించుకున్నాడు అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Also Read : రామ్ చరణ్ గౌతమ్ తిన్ననూరి సినిమా చేసి ఉంటే బాగుండేదా..?
చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన చాలా సినిమాలు అద్భుతాలను సృష్టించాయి. కానీ ఆయన కెరియర్ లో కూడా ఆయనకు భారీ డిజాస్టర్ లను అందించిన సినిమాలు రెండు ఉన్నాయి. అందులో ఒకటి కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘రిక్షావోడు’ సినిమా కాగా… మరొకటి గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘మృగరాజు’ (Mrugaraju) సినిమా… ఈ రెండు సినిమాల్లో కూడా చిరంజీవి తన నటనతో ప్రేక్షకులను మెప్పించినప్పటికి ఆయన ఎంచుకున్న క్యారెక్టర్స్ అతనికి భారీగా మైనస్ గా మారాయి. ముఖ్యంగా ‘రిక్షావోడు’ సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ లో చేసిన చిరంజీవి గెటప్ ఏమాత్రం బాగుండవు. ఆ సినిమాల స్టోరీ కూడా అంత కన్వీనెంట్ గా ఉండదు…
బాలయ్య
బాలయ్య బాబు హీరోగా వచ్చిన చాలా సినిమాలు ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేశాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం ఆయనకు భారీగా మైనస్ అయ్యాయనే చెప్పాలి. ఆ సినిమాలు ఏంటంటే…
దేవుడు, పల్నాటి బ్రహ్మనాయుడు, విజయేంద్ర వర్మ, ఒక్కమగాడు, వీరభద్ర, మహారధి సినిమాలు ఆయన కెరియర్ లోనే భారీ డిజాస్టర్లుగా నిలిచాయి…ఈ సినిమాలతో మనం భారీగా బ్యాడ్ నేమ్ అయితే మూటగట్టుకున్నాడు…
నాగ్
నాగ్ తన కెరీర్లో చాలా మంచి సినిమాలను చేస్తూ గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఈయన కెరియర్ లో కూడా కొన్ని డిజాస్టర్ సినిమాలు ఉన్నాయి. అందులో భావనచ్చాడు, కేడి, భాయ్, మన్మధుడు -2 లాంటి సినిమాలు ఉండడం విశేషం…
వెంకటేష్
వెంకటేష్ హీరోగా వచ్చిన సినిమాలన్నీ మినిమం గ్యారంటీ సినిమాలుగా నిలుస్తాయి. కానీ రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన సుభాష్ చంద్రబోస్, మెహర్ రమేష్ (Mehar Ramesh) దర్శకత్వంలో వచ్చిన షాడో (Shado) సినిమాలో అతని లుక్స్ ఏ మాత్రం ఇంప్రెస్సివ్ గా ఉండవు. దానికి తగ్గట్టుగానే కథ కూడా ప్రేక్షకులను ఎంగేజ్ చేయకపోవడంతో రెండు సినిమాలు డిజాస్టర్లు గా మిగిలాయి…
పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ కెరియర్ లో పెద్దగా డిజాస్టర్ సినిమాలేమి లేనప్పటికి పులి, సర్దార్ గబ్బర్ సింగ్, అఙ్ఞాత వాసి సినిమాలు భారీ డిజాస్టర్లు గా నిలిచాయి…
మహేష్ బాబు
మహేష్ బాబు హీరోగా వచ్చిన సినిమాల్లో ఒక మూడు సినిమాలు భారీ డిజాస్టర్లుగా నిలిచాయి…అందులో ఒకటి నాని కాగా, మరొకటి బ్రహ్మోత్సవం, ఇంకొకటి స్పైడర్…ఈ మూడు సినిమాలు భారీ డిజాస్టర్లుగా నిలిచాయి…
రామ్ చరణ్
రామ్ చరణ్ హీరోగా వచ్చిన సినిమాల్లో చాలా సినిమాలు సూపర్ సక్సెస్ గా నిలిచాయి…అయినప్పటికి తుఫాన్ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది…ఇక బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వచ్చిన వినయ విధేయ రామ సినిమా కూడా ఆయనకు బ్యాడ్ నేమ్ ను అయితే తీసుకువచ్చింది.
ఎన్టీఆర్
ఎన్టీఆర్ చేసిన సినిమాల్లో ఆంధ్రావాలా, నా అల్లుడు, శక్తి, రభస లాంటి సినిమాలు ఆయన ఇమేజ్ ను డ్యామేజ్ చేశాయనే చెప్పాలి.
ప్రభాస్
ప్రభాస్ కెరియర్ లో ఆయన భారీ సక్సెస్ లను సాధించిన కూడా రెబల్ లాంటి ఒక అల్ట్రా డిజాస్టర్ ను మూటగట్టుకున్నాడు.
అల్లు అర్జున్
అల్లు అర్జున్ పుష్ప 2 తో పాన్ ఇండియా ను షేక్ చేసినప్పటికి వరుడు సినిమాతో డిజాస్టర్ ను అందుకున్నాడు.
Also Read : అల్లు అర్జున్ పుట్టినరోజుని పట్టించుకోని టాలీవుడ్ సెలబ్రిటీలు..!