https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : రన్నర్ గా నిల్చిన గౌతమ్ కి కూడా ప్రైజ్ మనీ ఇచ్చారా..? ఇది ఊహించని ట్విస్ట్..ఎంత ఇచ్చారో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన గౌతమ్, ఇప్పటి వరకు వైల్డ్ కార్డ్స్ ఎవ్వరూ క్రియేట్ చెయ్యనంత సెన్సేషన్ ని క్రియేట్ చేసి రన్నర్ గా నిల్చిన సంగతి తెలిసిందే.

Written By:
  • Vicky
  • , Updated On : December 16, 2024 / 09:02 AM IST
    Gautham

    Gautham

    Follow us on

    Bigg Boss Telugu 8 : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన గౌతమ్, ఇప్పటి వరకు వైల్డ్ కార్డ్స్ ఎవ్వరూ క్రియేట్ చెయ్యనంత సెన్సేషన్ ని క్రియేట్ చేసి రన్నర్ గా నిల్చిన సంగతి తెలిసిందే. హౌస్ లోకి అడుగుపెట్టిన రెండవ వారం నామినేషన్స్ లోకి వచ్చి, ఎలిమినేట్ అయ్యి, మణికంఠ సెల్ఫ్ ఏవిక్షన్ కారణంగా, అదృష్టం కలిసొచ్చి సేవ్ అయిన గౌతమ్, ఆ మరుసటి వారం నుండి పూర్తిగా గేమ్ వైపు ఫోకస్ పెట్టి, తన సత్తా చాటుతూ వచ్చాడు. టైటిల్ విన్నర్ గా నిల్చిన నిఖిల్ గ్రూప్ గేమ్స్ ఆడాడు. అతనితో స్నేహం చేసిన కంటెస్టెంట్స్, ఎలిమినేట్ అయ్యాక బయటకి వచ్చి నిఖిల్ గెలుపు కోసం చాలా కష్టపడ్డారు. కానీ గౌతమ్ కి అలా లేదు. సోలో బ్రాండ్ తోనే ఇంత దూరం వచ్చాడు. కచ్చితంగా నిఖిల్ టైటిల్ గెలుస్తాడు అనుకున్న ఆయన ఫ్యాన్స్ కి ముచ్చమటలు పట్టించాడు.

    ఇది ఇలా ఉండగా టైటిల్ గెలుచుకున్న నిఖిల్ కి 42 లక్షల రెమ్యూనరేషన్ తో పాటు, 55 లక్షల ప్రైజ్ మనీ దక్కింది. రెమ్యూనరేషన్ లో ఎలాంటి కట్టింగ్స్ లేవు కానీ, ప్రైజ్ మనీ కి మాత్రం ఎంటర్టైన్మెంట్ టాక్స్ తో పాటు, 30 శాతం జీఎస్టీ పడుతుంది. దాంతో 55 లక్షల ప్రైజ్ మనీ కాస్త 39 లక్షలు అయ్యింది. మొత్తం మీద నిఖిల్ 79 లక్షల రూపాయిలు + కారు ఈ సీజన్ ద్వారా వచ్చింది అన్నమాట. అయితే రన్నర్ గౌతమ్ కి కూడా ప్రైజ్ మనీ ఇచ్చి ఉండుంటే బాగుండేది అని ఆయన అభిమానులు సోషల్ మీడియా లో స్టార్ మా ఛానల్ ని ట్యాగ్ చేసి పోస్టులు వేశారు. ఎందుకంటే డిజాస్టర్ అవ్వాల్సిన ఈ సీజన్ పైకి లేచిందంటే, అందుకు ఉన్న రెండు మూడు కారణాలలో గౌతమ్ కూడా ఒకడు.

    ఆయన వచ్చిన తర్వాతనే గేమ్ లో మజా వచ్చింది. ముఖ్యంగా నామినేషన్స్ రోజు నాడు కేవలం గౌతమ్ కోసమే బిగ్ బాస్ షోని చూసే వాళ్ళ సంఖ్య లక్షల్లో ఉంటుంది. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, గౌతమ్ కి కూడా 24 లక్షల రూపాయిల ప్రైజ్ మనీ ఇచ్చారట. అంతే కాకుండా పది వారాలు ఆయన బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు గానూ 30 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ కూడా వచ్చింది. అలా మొత్తం మీద ఆయనకు 54 లక్షల రూపాయిలు రెమ్యూనరేషన్ ఇచ్చినట్టు సమాచారం. ఇవంతా నిన్నటి ఎపిసోడ్ లోనే చూపించి ఉండొచ్చు. కానీ అప్పటికే చాలా సమయం అయిపోయిందట, షో ని ఎట్టి పరిస్థితిలో 9 గంటలు లోపు ముగించాలని పోలీసులు చెప్పడంతో, అంతా హడావడిగా షూటింగ్ ని పూర్తి చెయ్యాల్సి వచ్చింది.