IND vs WI 1st Test highlights: రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా వెస్టిండీస్ జట్టు భారతదేశంలో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా తొలి టెస్ట్ అహ్మదాబాద్ లో జరుగుతోంది. నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టీమిండియా ఆకాశమే హద్దుగా చెలరేగిపోతోంది. టీమ్ ఇండియా టెస్ట్ క్రికెట్ చరిత్రలో ముగ్గురు ఆటగాళ్లు సెంచరీలు చేసి సరికొత్త రికార్డులను సృష్టించారు. ఓపెనర్ రాహుల్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, వికెట్ కీపర్ ధృవ్ జూరెల్ సెంచరీలతో మోత మోగించారు..
రెండవ రోజు కేఎల్ రాహుల్, గిల్ అదరగొట్టారు. గిల్ హాఫ్ సెంచరీ చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత రాహుల్ సెంచరీ చేసి అవుట్ అయ్యాడు. ఇక జురెల్, రవీంద్ర జడేజా ఐదో వికెట్ కు ఏకంగా 206 పరుగులు జోడించారు. అంతేకాదు వీరిద్దరు కూడా సెంచరీలు చేశారు.. జురెల్ 125 పరుగులు చేసి .. సుదీర్ఘ ఫార్మాట్లో తొలి శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.. రవీంద్ర జడేజా కూడా 104* పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. వాషింగ్టన్ సుందర్ ఈ కథనం రాసే సమయం వరకు 9 పరుగులు చేశాడు.
రెండవ రోజు వెస్టిండీస్ బౌలర్ల పై టీమిండియా ఆటగాళ్లు సంపూర్ణ ఆధిపత్యాన్ని కొనసాగించారు. రాహుల్, జురెల్, జడేజా దుమ్మురేపారు. వీరు ముగ్గురు అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నారు.. పిచ్ నుంచి లభిస్తున్న సహకారాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు.. తద్వారా టీమిండియా లీడ్ ను అమాంతం పెంచారు. టీమిండియా లీడ్ ప్రస్తుతానికి వెస్టిండీస్ మీద 286 పరుగులకు పెరిగిపోయింది.. ఇంకా భారత్ చేతిలో ఐదు వికెట్లు ఉన్నాయి. వెస్టిండీస్ బౌలింగ్లో ఏమాత్రం పసలేదు. పరుగులు ధారాళంగా ఇచ్చేస్తున్నారు. రవీంద్ర జడేజా, జూరెల్ ఐదో వికెట్ కు 206 పరుగులు జోడించారంటే వెస్టిండీస్ బౌలింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం టీమ్ ఇండియా స్కోరు 448 పరుగులుగా ఉంది. ఒకవేళ 500 పరుగులకు పూర్తయితే టీమిండియా కెప్టెన్ గిల్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే అవకాశం ఉంది. అప్పుడు వెస్టిండీస్ జట్టు మీద మరింత ఒత్తిడి పెరిగిపోతుంది. తొలి ఇన్నింగ్స్ మాదిరిగానే కుప్పకూలిపోతే టీమిండియా కు ఇన్నింగ్స్ తేడాతో అద్భుతమైన విజయం సొంతం అవుతుంది.
SIR JADEJA WITH THE SWORD CELEBRATION. pic.twitter.com/d2bHyyOgq2
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 3, 2025