Balakrishna And Thaman: సినిమా ఇండస్ట్రీలో ప్రతి హీరోకి ఒక స్టైల్ ఉంది. వాళ్లు ఎలాంటి సినిమాలు చేసిన తమ స్టైల్ ని మాత్రం మిస్ అవ్వకుండా చూసుకుంటారు. నందమూరి బాలకృష్ణ కి మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన పంచ్ డైలాగులకు, ఆయన చేసే ఫైట్లకు జనం నీరాజనం పడుతుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే బాలయ్య బాబు గత కొంతకాలం నుంచి వరుస సక్సెస్ లను సాధిస్తున్నాడు. ఇప్పటికే నాలుగు విజయాలతో మంచి ఊపు మీదున్న ఆయన ఇప్పుడు బోయపాటి డైరెక్షన్ లో చేస్తున్న ‘అఖండ 2’ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు… ఇక ఇప్పటికే ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన రిలీజ్ అవుతోంది అంటూ మేకర్స్ అనౌన్స్ చేసినప్పటికి కొన్ని టెక్నికల్ కారణాల వల్ల ఈ సినిమా పోస్ట్ పోన్ చేసినట్టుగా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఇక దానికి తగ్గట్టుగానే గ్రాఫిక్స్ వర్క్ కూడా ఈ సినిమాలో ఎక్కువగా ఉందట. దానివల్ల కూడా ఈ సినిమా లేట్ అయినట్టుగా దర్శకుడు బోయపాటి శ్రీను గతంలో క్లారిటీ ఇచ్చాడు. ఇక ఇప్పుడు రిలీజ్ డేట్ ఎప్పుడు అనేదానిమీద సరైన క్లారిటీ అయితే రావడం లేదు. కానీ తొందర్లోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అయిన తమన్ మీద ప్రస్తుతం బాలయ్య బాబు కొంతవరకు కోపంతో ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఎందుకంటే ‘అఖండ 2’ మూవీ కి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వాల్సిన తమన్ దాన్ని పక్కన పెట్టి ఓజీ సినిమాకి మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడట. ఇక ఆ సినిమా కోసం ‘అఖండ 2’ సినిమాకి ఇవ్వాల్సిన మ్యూజి ను పోస్ట్ పోన్ చేశాడనే కోపంతో బాలయ్య ఉన్నాడట. నిజానికి అన్ని అనుకున్నట్టుగా కుదిరితే ఈ దసర కి బాలయ్య అఖండ 2 సినిమాతో ప్రేక్షకులను ఆరించేవాడు. కానీ మధ్యలో జరిగిన కొన్ని ఇష్యూస్ కారణంగా సినిమాని పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చిందట.
మరి తమన్ సైతం తన బ్యాగ్రౌండ్ స్కోర్ ని ఇవ్వడంలో చాలావరకు లేట్ చేశారని అందువల్లే సినిమా లేట్ అవుతుందంటూ బాలయ్య గతంలో కొన్ని కామెంట్స్ చేశాడు. మరి వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు పెద్దగా సన్నిహిత సంబంధాలైతే లేవని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. గతంలో బాలయ్య సినిమాలకు మంచి మ్యూజిక్ ని అందించి నందమూరి తమన్ గా మంచి పాపులారిటిని సంపాదించుకున్నాడు.
మరి అలాంటి తమన్ ఇప్పుడు బాలయ్య బాబుకి దూరమవుతున్నాడా? అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. దీనికి కారణం పవన్ కళ్యాణ్ అయిన అని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక తమన్ ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ కి బాగా దగ్గరయ్యాడు. దానివల్ల బాలయ్య బాబుకి దూరం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని మరి కొంతమంది చెబుతుండడం విశేషం…