శ్రీలంకతో జరుగుతున్న రెండో టీట్వీంటీకి భారత్ కష్టాల పాలైంది. క్రికెటర్ కృనాల్ పాండ్యాకు కరోనా సోకడంతో అతడితో కాంటాక్ట్ అయిన 8 మంది కీలక భారత ఆటగాళ్లను క్వారంటైన్ కు పంపారు. దీంతో జట్టులో ఉన్న మిగిలిన బౌలర్లతోనే టీమిండియా బరిలోకి దిగాల్సిన పరిస్థితులు ఏర్పాడ్డాయి.
ఏడుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్ కూడా లేకుండా భారత జట్టు బరిలోకి దిగింది. కృణాల్ పాండ్యాకు కరోనా సోకగా.. అతడితోపాటు కీలక ఆటగాళ్లు ఫృథ్వీషా, సూర్యకుమార్ , ఇషాన్ కిషన్, దీపక్ చాహర్ సహా కీలక ఆటగాళ్లు అందరూ క్వారంటైన్ కు వెళ్లాల్సి వచ్చింది. దీంతో ఉన్న సెకండ్ హ్యాండ్ టీంలో మిగిలిన అందరికీ అవకాశం కల్పించారు. ఏకంగా ఆరుగురు బౌల్లను తీసుకొని కేవలం 5 స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్ తో భారత జట్టు ఆడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
భారత జట్టును చూస్తే శిఖర్ ధావన్, భువనేశ్వర్ , సంజూ శాంసన్ తప్ప మిగతా అందరూ కొత్తవారే కావడం గమనార్హం. బెంచ్ లోని అందరూ కొత్తవాళ్లను తీసుకున్నారు. అసలు బ్యాట్స్ మెన్లు లేకపోవడంతో బౌలర్లతో ఆడిస్తున్న పరిస్థితి ఇండియాకు నెలకొంది.
రుతురాజ్ గైక్వైడ్, దేవదత్ పడిక్కల్, నితీష్ రానా, రాహుల్ చహర్, సైనీ, చేతన సకారియా, వరుణ్ చక్రవర్తిలతో భారత్ బరిలోకి దిగింది.
వీరితో అసలు ఇండియా శ్రీలంకపై గెలుస్తుందా? లేదా అన్నది డౌట్ గా మారింది. కుర్రాళ్లు అనుభవలేమి కావడంతో టీమిండియా శిబిరం ఆందోళనగా ఉంది.
https://twitter.com/BCCI/status/1420385000860516357?s=20