బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త.. రూ.5 లక్షల బీమా..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బ్యాంకులకు చెందిన ఖాతాదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఆర్బీఐ మారటోరియం విధించినా ఖాతాదారులకు డిపాజిట్ బీమా వర్తిస్తుందనికేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ కు కేంద్రం సవరణలు చేయగా కేంద్ర కేబినేట్ ఆమోద ముద్ర వేసింది. నిర్మలా సీతారామన్ తాజాగా ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ తాజా సవరణల వల్ల 98.3 శాతం […]

Written By: Kusuma Aggunna, Updated On : July 29, 2021 11:47 am
Follow us on

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బ్యాంకులకు చెందిన ఖాతాదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఆర్బీఐ మారటోరియం విధించినా ఖాతాదారులకు డిపాజిట్ బీమా వర్తిస్తుందనికేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ కు కేంద్రం సవరణలు చేయగా కేంద్ర కేబినేట్ ఆమోద ముద్ర వేసింది. నిర్మలా సీతారామన్ తాజాగా ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ తాజా సవరణల వల్ల 98.3 శాతం మంది ఖాతాదారులు లబ్ధి పొందుతారని తెలిపారు. బ్యాంకులపై ఆర్బీఐ మారటోరియం విధిస్తే 90 రోజుల్లో ఖాతాదారులు డిపాజిట్లపై 5 లక్షల రూపాయల వరకు బీమా సౌకర్యాన్ని పొందే అవకాశం అయితే ఉంటుందని సమాచారం. బ్యాంకు డిపాజిటర్లకు బ్యాంకు లైసెన్స్ ను రద్దు చేసి, లిక్విడేషన్ చర్యలను ప్రారంభించిన తర్వాత ఈ మొత్తాన్ని పొందే అవకాశం అయితే ఉంటుంది.

బ్యాంక్ నష్టాల్లో ఉండి సాధారణ కార్యకలాపాలపై ఆర్బీఐ నిషేధం విధిస్తే సాధారణ కార్యకలాపాల ద్వారా డబ్బును పొందే అవకాశం ఉంటుంది. వేర్వేరు బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నవాళ్లకు రెండు ఖాతాలు మూసివేసే పరిస్థితి వస్తే 10 లక్షల రూపాయల వరకు బీమా పొందే అవకాశం లభిస్తుంది. ఒక బ్యాంకులో డిపాజిట్ల మొత్తం ఐదు లక్షల కంటే ఎక్కువ ఉంటే అసలు, వడ్డీ కలిపి రూ.5 లక్షలు పొందవచ్చు.

పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, పెద్దల పొదుపు పథకం ఖాతాలకు కేంద్రం హామీ ఉంటుంది కాబట్టి వీటికి ఎక్కువ మొత్తంలో బీమా పొందలేము. ఒక వ్యక్తికి వేర్వేరు హోదాల్లో ఖాతాలు ఉంటే విడివిడిగా బీమా లభించే అవకాశం అయితే ఉంటుంది.