ప్రస్తుతం కంపెనీ కస్టమర్లకు మెరుగైన కనెక్టివిటీని అందించడంపై ప్రధానంగా దృష్టి పెట్టింది. ఎంట్రీ లెవెల్ ప్లాన్ల వల్ల కస్టమర్లు తమ అకౌంట్ బ్యాలెన్స్ గురించి ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదని ఎయిర్ టెల్ చెబుతోంది. 2021 సంవత్సరం జులై 29వ తేదీ నుంచి కొత్త ధరలు అమలులోకి రానున్నాయని సమాచారం. 79 రూపాయల ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా 64 రూపాయల టాక్ టైమ్ ను పొందవచ్చు.
ఈ ప్లాన్ ను రీఛార్జ్ చేసుకోవడం ద్వారా 200 ఎంబీ డేటాతో పాటు 28 రోజుల వాలిడిటీని పొందే అవకాశం ఉంటుంది. ఎయిర్ టెల్ తాజా నిర్ణయం ద్వారా ప్రతి వినియోగదారుడి సగటు ఆదాయాన్ని పెంచడంపై ప్రధానంగా దృష్టి పెట్టిందని తెలుస్తోంది. ఎయిర్ టెల్ గత వారం పోస్ట్ పెయిడ్ ప్లాన్లను సైతం అప్ గ్రేడ్ చేసిన సంగతి తెలిసిందే. ఎయిర్ టెల్ నిర్ణయం వల్ల కస్టమర్లకు భారీగా ప్రయోజనం చేకూరనుంది.
ఎయిర్ టెల్ బేసిక్ ప్లాన్ విషయంలో మార్పులు చేయడంతో ఇతర టెలీకాం కంపెనీలు సైతం ఆదాయం పెంచడంపై ప్రధానంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఎయిర్‌టెల్ తన పోస్ట్ పెయిడ్ ప్లాన్లను సైతం గత వారం అప్ గ్రేడ్ చేసిన సంగతి తెలిసిందే.