Ind Vs SA: మరికొద్ది గంటల్లో రాయ్ పూర్ వేదికగా టీమిండియా, దక్షిణాఫ్రికా తలబడుతున్నాయి. ఈ వేదిక మీద ఇప్పటివరకు ఒకసారి మాత్రమే టీమిండియా ఆడింది. ఆ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టును ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది. ప్రస్తుతం మూడు వన్డేల సిరీస్ లో టీమిండియా ఇప్పటికే తొలి మ్యాచ్ గెలిచింది.
బుధవారం జరిగే రెండవ మ్యాచ్లో కూడా గెలిచి.. సిరీస్ చేసుకోవాలని భావిస్తోంది. టెస్ట్ సిరీస్ వైట్ వాష్ కు గురైన నేపథ్యంలో పర్యటక జట్టుపై బలమైన ప్రతీకారం తీర్చుకోవాలని టీమ్ ఇండియా భావిస్తోంది. తొలి మ్యాచ్లో టీమిండియా భారీగా పరుగులు చేసినప్పటికీ.. వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్ దారుణంగా విఫలమయ్యారు.
వాషింగ్టన్ సుందర్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ.. అతడు వాటిని అందుకోవడంలో విఫలమయ్యాడు. 19 బంతులు ఎదుర్కొన్న అతడు 13 పరుగులు మాత్రమే చేశాడు. బంతితో మాత్రం పొదుపుగా బౌలింగ్ వేశాడు. మూడు ఓవర్లు వేసి, 18 పరుగులు మాత్రమే ఇచ్చాడు. వికెట్లు తీయలేకపోయాడు.. అయితే రాయ్ పూర్ వన్డేలో అతడి స్థానంలో తిలక్ వర్మను ఆడిస్తారని ప్రచారం జరుగుతోంది.
తిలక్ వర్మ ఇటీవల ఆసియా కప్ లో పాకిస్తాన్ మీద అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి.. టీం ఇండియాను గెలిపించాడు. అతడు స్పిన్ బౌలింగ్ కూడా వేయగలడు. రాయ్ పూర్ మైదానం బౌలర్లకు అనుకూలంగా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. బ్యాట్ ద్వారా పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్న సుందర్ ప్లేసులో తిలక్ ను తీసుకుంటారని తెలుస్తోంది. పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు.. ఇక రాంచీలో రోహిత్, విరాట్ వీరోచితమైన బ్యాటింగ్ చేశారు. వీరిద్దరూ అవుట్ అయిన తర్వాత రామ్ రెడ్డి దారుణంగా పడిపోయింది. చివర్లో రాహుల్ వేగంగా ఆడేందుకు ప్రయత్నించాడు. మిడిల్ ఆర్డర్లో వాషింగ్టన్ విఫలమయ్యాడు కాబట్టి.. అతడి స్థానంలో తిలక్ వర్మను ఆడిస్తారని తెలుస్తోంది.
తిలక్ వర్మ జట్టు పరిస్థితులకు అనుకూలంగా బ్యాటింగ్ చేస్తాడు. అవసరమైతే వీరోచితమైన ఇన్నింగ్స్ ఆడతాడు.. వికెట్లు పడుతుంటే నిదానంగా బ్యాటింగ్ చేస్తుంటాడు. చెత్త బంతులను దారుణంగా శిక్షిస్తాడు.. పైగా హిట్టింగ్ చేయడంలో అతడు సిద్ధహస్తుడు. జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో తిలక్ వర్మ వీరోచితమైన బ్యాటింగ్ చేసి అదరగొట్టాడు.. అందువల్లే అతడి మీద మేనేజ్మెంట్ నమ్మకంతో ఉంది.