Renu Desai: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) మాజీ భార్య గా రేణు దేశాయ్(Renu Desai) కి సోషల్ మీడియా లో మంచి పాపులారిటీ ఉంది. ఫ్యాషన్ మోడల్ గా కెరీర్ ని మొదలు పెట్టిన ఆమె, ఆ తర్వాత పవన్ కళ్యాణ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన బద్రి సినిమా ద్వారా మన టాలీవుడ్ ఆడియన్స్ కి పరిచయం అయ్యింది. ఈ సినిమా షూటింగ్ సమయం లోనే పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడడం, ఆ తర్వాత కొన్నాళ్ళు సహజీవనం చేసి పెళ్లి చేసుకోవడం వంటివి జరిగాయి. ఈ దంపతులిద్దరికీ అకిరా, ఆద్య అని ఇద్దరు పిల్లలు పుట్టారు. వీళ్లిద్దరికీ ప్రస్తుతం సోషల్ మీడియా లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అకిరా నందన్ టాలీవుడ్ ఎంట్రీ కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ తో రేణు దేశాయ్ విడాకులు తీసుకున్న తర్వాత రెండవ పెళ్లి కి సిద్దమైన సంగతి తెలిసిందే.
బందు మిత్రుల సమక్ష్యం లో ఆమె నిశ్చితార్థం కూడా చేసుకుంది. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ, ఈ నిశ్చితార్థం పెళ్లి వరకు వెళ్ళలేదు. మధ్యలోనే ఆగిపోయింది. అప్పటి నుండి ఒంటరి గానే తన పిల్లలతో కలిసి పూణే లో జీవిస్తూ ఉంది. రీసెంట్ గానే హైదరాబాద్ కి షిఫ్ట్ అయిన రేణు దేశాయ్ మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఇదంతా పక్కన పెడితే రేణు దేశాయ్ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి. ఆమె మాట్లాడుతూ ‘ఇలాంటి వీడియో నేను ఒక రోజు చేయాల్సి వస్తుందని నిజంగా నేను అనుకోలేదు. నేను రీసెంట్ గానే ఒక ఇంటర్వ్యూ లో యాంకర్ మీ భవిష్యత్తు ప్లాన్స్ ఏమిటి అని అడిగితే, సన్యాసం తీసుకుంటాను అని సరదాగా చెప్పాను’.
‘ఇది ఇప్పుడు చాలా పెద్ద న్యూస్ అయిపోయింది. నా మిత్రులు నాకు ఇది షేర్ చేయడం చూసి ఆశ్చర్యపోయాను. ఏమైంది నీకు అసలు, మంచి జీవితాన్నే అనుభవిస్తున్నావు కదా, సన్యాసం తీసుకోవాలని ఎందుకు అనిపించింది అని నా మిత్రులు అడిగారు. నా వయస్సు ప్రస్తుతానికి 45 ఏళ్ళు. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆద్య పదవ తరగతి జరుగుతుంది. వాళ్ళ జీవితాలను స్థిరపరిచే బాధ్యత నాపై ఉంది. ప్రస్తుతం నా ప్రపంచం వాళ్ళే, ఆ తర్వాతే దేవుడు. కచ్చితంగా సన్యాసం తీసుకుంటాను, దానికి చాలా సమయం పడుతుంది. బహుశా నాకు 65 ఏళ్ళ వయస్సు వచ్చినప్పుడు ఆ నిర్ణయం తీసుకుంటానేమో’ అంటూ చెప్పుకొచ్చింది రేణు దేశాయ్. ఇంకా ఆమె ఏమి మాట్లాడిందో ఈ క్రింది వీడియో లో చూసి తెలుసుకోండి.
నేను సన్యాసం తీసుకోను
నాకు ఫస్ట్ పిల్లలు ముఖ్యం
ఆ తర్వాతే దేవుడు
ఇప్పుడు నా ఏజ్ 45, 65 ఏళ్ల వయసులో సన్యాసం తీసుకుంటాను
– రేణు దేశాయ్ pic.twitter.com/ZIpOFshQCn
— BIG TV Breaking News (@bigtvtelugu) December 2, 2025