IND vs SA : టీ20 వరల్డ్ కప్ 2024 గెలిచే సంకేతాలు టీమిండియాకు వచ్చేశాయి. గత వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లో టీమిండియా టాస్ ఓడిపోయింది. నల్లరేగటి పిచ్ పై మొదట బ్యాటింగ్ చేసి ఓడిపోయింది. ఆస్ట్రేలియా పిచ్ ను అడ్వంటేజ్ గా తీసుకొని గెలిచేసింది. కానీ టీ20 వరల్డ్ కప్ లో మాత్రం టీమిండియాకు అదృష్టం కలిసి వచ్చింది. కీలకమైన టాస్ ను టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గెలవడం విశేషం.
వెస్టిండీస్ లోని బార్బడాస్ లో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో సౌతాఫ్రికాతో టీమిండియా ఫైనల్ లో తలపడుతోంది. రవిశాస్త్రి వ్యాఖ్యతగా ఎంట్రీ ఇచ్చి ముందు టాస్ వేయించారు. ఈ కీలకమైన టాస్ లో టీమిండియాకు అదృష్టం మనవైపే నిలిచింది.
టాస్ ను సౌతాఫ్రికా కెప్టెన్ మార్క్రమ్ వేయగా.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పారు. మనవైపే టాస్ నిలవడంతో స్టేడియం హోరెత్తింది. రోహిత్ శర్మ మోములోనూ సంతోషం వెల్లివిరిసింది. మ్యాచ్ గెలిచినంత ఆనందం వ్యక్తం చేశాడు. ఇక టాస్ ఓడిన మార్క్రమ్ నిరాశలో కనిపించాడు. ఈ పిచ్ పై టాస్ గెలిస్తే తానే బ్యాటింగ్ తీసుకునేవాడినని.. కానీ టాస్ నెగ్గలేకపోయానని ఆవేదన చెందాడు.
బార్బడాస్ పిచ్ పై టాస్ గెలిస్తే మ్యాచ్ గెలిచినట్టే మొదట ప్లాట్ బ్యాట్ పైకి వచ్చే బాల్ రెండో ఇన్నింగ్స్ లో లో అవుతుంది. అది సెకండ్ బ్యాటింగ్ చేసేవారికి కష్టం. అందుకే టాస్ కీలకమైన పాత్రను పోషిస్తుంది. అది టీమిండియా గెలవడంతో సగం మ్యాచ్ గెలిచినట్టేనని విశ్లేషకులు అంటున్నారు.
Toss Update from Barbados
Captain Rohit Sharma has won the toss & #TeamIndia have elected to bat against South Africa in the #T20WorldCup Final.
Follow The Match ▶️ https://t.co/c2CcFqXzZC#SAvIND | @ImRo45
ICC pic.twitter.com/rHw7o8iGvu
— BCCI (@BCCI) June 29, 2024