IND Vs SA: ధోని ఆధ్వర్యంలో టీమిండియా 2007లో టి20 వరల్డ్ కప్ సాధించింది. ఆ తర్వాత మళ్లీ ఆ ఘనతను పునరావిష్కరించడానికి టీమ్ ఇండియాకు దాదాపు 17 సంవత్సరాలు పట్టింది. 2024లో t20 వరల్డ్ కప్ సాధించిన తర్వాత టీమ్ ఇండియా పొట్టి ఫార్మాట్లో ఏ సిరీస్ కూడా కోల్పోలేదు. ఆస్ట్రేలియా నుంచి మొదలు పెడితే బంగ్లాదేశ్ వరకు ప్రతి జట్టు మీద టీమిండియా విజయం సాధించింది.
ప్రస్తుతం స్వదేశం వేదికగా టీమిండియా దక్షిణాఫ్రికా జట్టుతో ఐదు టి20 మ్యాచ్లో సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా తొలి మ్యాచ్లో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. రెండో మ్యాచ్లో దారుణమైన ఆట తీరు ప్రదర్శించింది. ముఖ్యంగా టీమ్ ఇండియా బౌలర్లు అత్యంత చెత్త బౌలింగ్ వేశారు. బుమ్రా నుంచి మొదలుపెడితే వరుణ్ చక్రవర్తి వరకు దారుణంగా పరుగులు ఇవ్వడం అభిమానులను ఆవేదనకు గురిచేస్తోంది. అర్ష్ దీప్ సింగ్ అత్యంత చెత్త బౌలింగ్ వేశాడు. అతడు ఏకంగా ఆరు వైడ్లు వేయడం విశేషం. 4 ఓవర్ల పాటు బౌలింగ్ వేసిన అతడు 54 పరుగులు సమర్పించుకున్నాడు. చండీగఢ్ ఇతడికి సొంత మైదానం కావడం విశేషం. బుమ్రా కూడా నాలుగు ఓవర్ల పాటు బౌలింగ్ వేసి 45 పరుగుల సమర్పించుకున్నాడు. వరుణ్ చక్రవర్తి నాలుగు ఓవర్లు బౌలింగ్ వేసి 29 పరుగులు ఇచ్చాడు. అక్షర్ మూడు ఓవర్లు వేసి 27 పరుగులు సమర్పించుకున్నాడు. హార్దిక్ పాండ్యా 3 ఓవర్లు వేసి 34 పరుగులు ఇచ్చాడు. శివం దుబే రెండు ఓవర్లు వేసి 18 పరుగులు ఇచ్చాడు.
వచ్చే ఏడాది భారత్ వేదికగా టి20 వరల్డ్ కప్ జరగనుంది. ఆ సిరీస్ లో అదరగొట్టాలని టీమిండి అభిమానులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా జట్టుతో జరిగే ఐదు t20 మ్యాచ్ల సిరీస్ ను టి20 వరల్డ్ కప్ కు సన్నాహకంగా టీమిండియా భావిస్తోంది.. కాని క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అలా లేదు. బౌలర్లు దారుణంగా తేలిపోవడం అభిమానులను కలవరపరుస్తోంది. మొన్నటిదాకా టి20లలో అద్భుతంగా బౌలింగ్ వేసిన అర్ష్ దీప్ సింగ్.. సొంతం మైదానంలో తేలిపోవడం అభిమానులకు ఏమాత్రం మింగుడు పడడం లేదు. చండీగఢ్ మ్యాచ్లో టీమ్ ఇండియా బౌలర్ వికెట్లు సాధించడానికి ఫుల్టాస్ బంతులను వేశారు.. ఈ బంతులను మైదానం అవతలికి పంపించారు దక్షిణాఫ్రికా బ్యాటర్లు. వాస్తవానికి ఈ బంతులను ఎదుర్కోవడంలో దక్షిణాఫ్రికా బ్యాటర్లు సిద్ధహస్తులు. ఒకవైపు ఈ బంతులకు బీభత్సంగా పరుగులు వస్తున్నప్పటికీ టీమిండియా బౌలర్లు ఏమాత్రం పాఠాలు నేర్చుకోలేదు. పైగా పదేపదే అదే బంతులను వేయడంతో దక్షిణాఫ్రికా బ్యాటర్లు పండగ చేసుకున్నారు.
మరి కొద్ది నెలల్లో భారత వేదికగా టి20 వరల్డ్ కప్ జరగబోతున్న నేపథ్యంలో బౌలింగ్ ఇలా ఉండడాన్ని మాజీ ప్లేయర్లు తీవ్రంగా తప్పు పడుతున్నారు. వాస్తవానికి ఇలాంటి బౌలింగ్ ద్వారా టీమిండియా టి20 వరల్డ్ కప్ కాదు కదా.. దక్షిణాఫ్రికా జట్టుతో జరిగే సిరీస్ కూడా గెలవలేదని మాజీ ప్లేయర్లు చెబుతున్నారు. తొలి మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ వేసిన బౌలర్లు.. రెండవ మ్యాచ్ కు వచ్చేసరికి పూర్తిగా తేలిపోయారు.. పరుగులు ఇవ్వడంలో పోటీపడ్డారు. రెండో మ్యాచ్లో టీమిండియా బౌలర్లు 22 అదనపు బంతులు వేశారంటే బౌలింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చివరికి స్లాగ్ ఓవర్లలో ఎవరితో బౌలింగ్ వేయించాలో తెలియని దుస్థితిలో టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఉన్నాడంటే పరిస్థితి దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా టీమిండియా బౌలింగ్ మారాలి.. బౌలింగ్ కూర్పు లో వైవిధ్యం కనిపించాలి. లేనిపక్షంలో టీమిండియా కు మరో పరాభవం స్వదేశం వేదికగా తప్పదు.