American Companies: ఒకప్పుడు అమెరికా కంపెనీలు భారతదేశంలో పెట్టుబడి పెట్టడానికి అంతగా ఆసక్తిని చూపించేవి కాదు. ఒకవేళ పెట్టుబడులు పెట్టినప్పటికీ అనేక రకాల షరతులతో ఇక్కడికి వచ్చేవి. మనదేశంలో స్థిరమైన ప్రభుత్వాలు ఏర్పడకపోవడం వల్ల విదేశీ పెట్టుబడిదారులలో నమ్మకం ఉండేది కాదు. దీంతో కంపెనీలు ఏర్పాటు కాకపోవడంతో దేశానికి అంతగా ఆదాయం ఉండేది కాదు. 2014 నుంచి ఇప్పటివరకు దేశంలో స్థిరమైన ప్రభుత్వాలు ఏర్పడటం వల్ల పెట్టుబడిదారుల్లో నమ్మకం కలిగింది. దీనికి తోడు ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు కంపెనీలకు అనుకూలంగా ఉంటున్నాయి. ముఖ్యంగా అమెరికన్ కంపెనీలు భారతదేశంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి.
అమెరికన్ కంపెనీలు భారతదేశంలో పెట్టుబడులు పెట్టడం ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ కు ఏ మాత్రం ఇష్టం లేదు. అందువల్లే భారత్ మీద నిత్యం చిమ్ముతూనే ఉన్నాడు. భారతదేశంలో పెట్టుబడులు పెట్టకుండా అమెరికా కంపెనీలను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నాడు. 145 కోట్ల వినియోగదారుల మార్కెట్ ఉన్న భారతదేశంలో పెట్టుబడులు పెట్టకపోతే తమకు లాభాలు రావని అమెరికన్ కంపెనీలు భావించి.. మనదేశంలో భారీగా పెట్టుబడి పెడుతున్నాయి. మైక్రోసాఫ్ట్ నుంచి మొదలు పెడితే అమెజాన్ వరకు అన్ని కంపెనీలు భారతదేశానికి క్యూ కడుతున్నాయి.
అమెజాన్ ఇప్పటికే భారత దేశంలో విస్తృతంగా వ్యాపార కార్యకలాపాలు సాగిస్తోంది.. మరో మూడు లక్షల కోట్ల పెట్టుబడి పెట్టడానికి ఆ కంపెనీ ముందుకు వచ్చింది. మైక్రోసాఫ్ట్ కూడా 1,50,000 కోట్లతో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చింది. గూగుల్ కూడా అత్యంత విలువైన డాటా సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. భవిష్యత్తు కాలంలో ఇంకా ఎక్కువ స్థాయిలో కార్యకలాపాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని గూగుల్ ప్రకటించింది.. వాస్తవానికి ఈ మూడు సంస్థలు భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ముందు.. ఆ కంపెనీ ప్రతినిధులను ట్రంప్ కలిశాడు.. మనదేశంలో పెట్టుబడులు పెట్టకుండా నిలిపివేయడానికి ప్రయత్నించాడు. కానీ ఆ కంపెనీలు ఏమాత్రం అందుకు ఒప్పుకోలేదు.
అమెరికన్ కంపెనీలు భారతదేశంలోకి విపరీతంగా పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో ట్రంప్ ఏమాత్రం సహించలేకపోతున్నాడు. భారతదేశం మీద ఏదో ఒక రకంగా విమర్శలు చేస్తూనే ఉన్నాడు.. అమెరికన్ కంపెనీలను తీవ్రస్థాయిలో తప్పుపడుతున్న ట్రంప్.. తన రియల్ ఎస్టేట్ కంపెనీ ద్వారా ఇండియాలోనే పెట్టుబడులు పెడుతుండడం విశేషం. ఇప్పటికే హైదరాబాదులో ట్రంప్ టవర్స్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మొదలుపెట్టాడు అమెరికా అధ్యక్షుడు. భవిష్యత్ కాలంలో తన వ్యాపారాన్ని ఇంకా పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. కానీ అమెరికన్ కంపెనీలను మాత్రం నిలువరిస్తున్నాడు.
ట్రంప్ కు షాక్ ఇస్తూ అమెరికన్ కంపెనీలు భారతదేశంలో పెట్టుబడులు పెట్టడం వల్ల.. ఆర్థిక రంగం సమూల మార్పులకు గురవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం భారత్ ప్రపంచ ఆర్థిక శక్తులలో నాలుగో స్థానంలో ఉంది. ఇదే స్థాయిలో అమెరికన్ కంపెనీలు పెట్టుబడులు పెడితే నాలుగో స్థానం నుంచి మూడో స్థానానికి చేరుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఒకప్పుడు చైనా సహాయంతో రష్యా స్థానాన్ని అమెరికా లాగేసుకుందని.. అయితే ఇప్పుడు చైనా ను అమెరికా నమ్మదని.. అమెరికాను కూడా చైనా నమ్మదని ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు.. పైగా చైనాలో తన పెట్టుబడులను వెనక్కి తీసుకోవడానికి అమెరికా ఇష్టపడదని.. చైనాలో నియంతృత్వ ప్రభుత్వం ఉండడంతో అమెరికా కంపెనీలు ప్రత్యామ్నాయంగా భారత్ వైపు చూస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. పైగా భారత దేశంలో 145 కోట్ల జనాభా ఉన్న నేపథ్యంలో అమెరికన్ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.