IND VS PAK Match : ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) మ్యాచ్‌లు పోటాపోటీగా సాగుతున్నాయి. లీగ్ మ్యాచ్‌లలోనే అన్ని జట్లు నువ్వా నేనా అన్నట్లు ఆడుతున్నాయి. ఆటగాళ్లు కూడా పోటాపోటీ ఆటతీరుతో పరుగుల వరద పారిస్తున్నారు. క్రికెట్ అభిమానులకు కనుల పండుగ చేస్తున్నారు. టోర్నీలో భాగంగా గత ఆదివారం(ఫిబ్రవరి 23న) దాయాదుల పోరు జరిగింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా(Team India) ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ తన సత్తా చాటాడు. అద్భుతమైన ఆటతీరుతో పాకిస్తాన్‌ను చిత్తు చేశాడు. బౌలర్లు బంతితో మెరవగా, బ్యాట్స్‌మెన్స్ అందరూ రాణించారు. ఇక ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే భారత కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ(Mukesh ambani) విజేతగా నిలిచాడు. రికార్డు సృష్టించాడు. రిలయన్స్ ఇండస్ట్రీస్(Rilance Indastries)కు చెందిన జియోహాట్‌స్టార్ భారత్–పాక్ మ్యాచ్ ప్రసార హక్కులను కలిగి ఉంది. దీంతో కొన్ని గంటపాటు మ్యాచ్‌ను సుమారు 12 కోట్ల మందికిపైగా వీక్షించారు. మరోవైపు కంపెనీకి ఇతర ప్రసార హక్కులు, యాడ్ రెవన్యూ ద్వారా భారీగా ఆదాయం సమకూరినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో మ్యాచ్‌లో భారత్ గెలిస్తే.. ప్రసార హక్కుల ద్వారా ముఖేష్ అంబానీ విజేతగా నలిచినట్లు భావిస్తున్నారు.
ఇటీవలో హాట్‌స్టార్‌తో జట్టు..
రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో సినిమా, సిడ్నీ+హాట్‌స్టార్ ఇటీవలే జతకలిశాయి. జియోహాట్‌స్టార్(Jio hot star)గా ఆవిష్కరించాయి. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ఇరు కంపెనీలకు ఎంతో లాభదాయకమని ఇరు సంస్థలు తెలిపాయి. ఇటీవల జరిగిన ఒక్క మ్యాచ్‌లోనే భారీగా రెవన్యూ సంపాదించినట్లు మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. భారత్–పాకిస్తాన్ మ్యాచ్ రసవత్తరంగా ఉంటుందని గ్రహించే కోట్లాది వ్యూయర్స్ జియోహాట్‌స్టార్‌లో ఈ మ్యాచ్‌ను వీక్షించారు. ఇది ప్లాట్‌ఫామ్ వ్యూవర్‌షిప్‌ను పెంచడంతోపాటు ప్రకటనలు, సబ్‌స్క్రిప్షన్లను, సంస్థ ఆదాయాన్ని కూడా భారీగా పెంచింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలోని మరో స్పోర్ట్స్ ఛానెల్ స్పోర్ట్ 18(Sports 18) కూడా ఈ మ్యాచ్‌ను టెలివిజన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేసింది. దీంతో అంబానీ కంపెనీకి ఆన్‌లైన్‌తోపాటు టీవీ వ్యూవర్‌షిప్ రెంటింటి నుంచి లాభపడింది.
Also Read : పాక్ న్యూజిలాండ్ మ్యాచ్ కు ఇంతా క్రేజా? Jio hotstar లో ఎన్ని కోట్లమంది లైవ్ చూస్తున్నారో తెలుసా
జియోహాట్ స్టార్ ప్లాన్లు ఇలా..
ఇదిలా ఉంటే జియోహాట్‌స్టార్ ప్లాన్లు ఇలా ఉన్నాయి. రూ.195 డేతా ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. 15 జీబీక్షేటానుందిస్తుంది. క్రీడలు, వినోద ప్రియులకు ఇది తగిన ఎంపికగా ఉంటుంది. ఇతర ప్రామాణిక రీచార్జి ప్లాన్ల మాదిరిగా ఈ ఆఫర్‌లో వాయిస్ లేదా ఎస్‌ఎంఎస్ ప్రయోజనాలు ఉండవు. ఇందులో లభించే జియోహాట్‌స్టార్ సబస్క్రిఫ్షన్ 90 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. జియో హాట్‌స్టార్‌ను కేవలం మొబైల్‌లో మాత్రమే వీక్షించవచ్చు.
మరో ప్లాన్
రూ.195 డేటా ప్లాన్‌తో జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా వచ్చే మరో స్టాంర్డ్›్లన్ కూడా అందుబాబటులో ఉంది. అదే రూ.949 ప్లాన్. దీనికి 84 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. రోజుకు 2 జీబీ డేటా, అపరిమిత 5జీ డేటా, 84 రోజుల వ్యాలిడిటీతో ఉంటుంది. 84 రోజులు జియో హాట్‌స్టార్ ఉచిత మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ప్రయోజనాలు ఈ ప్లాన్‌తో పొందవచ్చు.
Also Read : రంజుగా ఛాంపియన్స్ ట్రోఫీ.. సెమీస్ లో టీమిండియా తలపడే జట్టు ఇదే
రీచార్జి ఇలా…
వినియోగదారులు ఈ ఆఫర్‌ను మై జియో యాప్, జియో వెబ్‌సైట్ లేదా అధీకృత జియో రిటైలర్ల ద్వారా పొందవచ్చు. రీచార్జి ప్రక్రియ ఇతర జియో ప్రీపెయిడ్ ప్లాన్ల మారిరిగానే ఉంటుంది. థర్డ్ పార్టీ రీచార్జి ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కూడా ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది.