ICC Champions trophy 2025 PAK vs NZ: 2017లో ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్ గెల్చుకుంది . ఫైనల్ మ్యాచ్లో భారత జట్టుపై ఘనవిజయం సాధించింది. నేపథ్యంలో డిపెండింగ్ ఛాంపియన్ గా పాకిస్తాన్ (PAK vs NZ) తన తొలి మ్యాచ్ న్యూజిలాండ్ జట్టుతో ఆడుతోంది. పాకిస్తాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.. పాకిస్తాన్ బౌలర్లు ప్రారంభంలో అద్భుతంగా బౌలింగ్ చేశారు. 73 పరుగులకే మూడు వికెట్లు తీసి.. న్యూజిలాండ్ జట్టును కష్టాల్లో పడేశారు. విల్ యంగ్(107) సెంచరీ తో కదం తొక్కాడు. టామ్ లాథమ్ తో కలిసి నాలుగో వికెట్ కు 118 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. తద్వారా న్యూజిలాండ్ జట్టు పటిష్ట స్థితికి చేరుకుంది. 73/3 నుంచి 191/4 వరకు న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ను నిర్మించారు.
జియో హాట్ స్టార్ లో కోట్లాది వ్యూస్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఓటీటీ హక్కులను జియో హాట్ స్టార్ సొంతం చేసుకుంది. సాధారణంగా భారత్ ఆడే మ్యాచ్ లకు ఓటీటీ లో కోట్ల వ్యూస్ లభిస్తాయి. పాకిస్తాన్ న్యూజిలాండ్ మ్యాచ్ కు ఈ స్థాయిలో ఓటీటీలో ఆదరణ లభిస్తుందని ఎవరు ఊహించలేదు.. జియో హాట్ స్టార్ లో 6.5 కోట్ల మంది లైవ్ లో చూశారు. ఈ కథనం రాసే సమయానికి ఇంకా పెరుగుతూనే ఉన్నారు. వాస్తవానికి ఇండియా ఆడే మ్యాచ్ లకు భారీగా వ్యూయర్ షిప్ వస్తుందని జియో హాట్ స్టార్ అంచనా వేసింది.. కానీ న్యూజిలాండ్, పాక్ మ్యాచ్ కు ఈ స్థాయిలో వ్యూయర్ షిప్ ను అంచనా వేయలేకపోయింది.. గతంలో పాకిస్తాన్ ఆడిన మ్యాచ్లకు ఈ స్థాయిలో వ్యూయర్ షిప్ లభించలేదు. ఛాంపియన్స్ ట్రోఫీ ని ఫ్రీగా చూసే అవకాశం జియో హాట్ స్టార్ కల్పించడంతో నెటిజన్లు వీక్షించడం మొదలుపెట్టారు. మరోవైపు ఎన్ని సంవత్సరాల తర్వాత చాంపియన్స్ ట్రోఫీ జరుగుతున్న నేపథ్యంలో నెటిజన్ల కు ఈ సిరీస్ మీద ఆసక్తి పెరిగింది.. త్వరలో జరిగే భారత్ – పాక్ మ్యాచ్ ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో వేచి చూడాల్సి ఉంది. అన్నట్టు ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో జియో హాట్ స్టార్ సెకండ్ల వ్యవధిలోని ప్రకటనకే లక్షల్లో వసూలు చేస్తోంది. అంటే ఈ లెక్కన ఫ్రీగా చూసే వెసలు బాటు కల్పించి..వ్యూ యర్ షిప్ ను పెంచుకొని.. జియో హాట్ స్టార్ దండిగా ఆదాయాన్ని సంపాదిస్తుందన్నమాట. అయితే గతంలో టీమిండియా ఆడిన మ్యాచులు కోట్లల్లో వ్యూస్ సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ను దాదాపు 10 కోట్ల మంది దాకా లైవ్ వీక్షించారు. ఇప్పటివరకు అదే రికార్డుగా ఉంది. 2023 లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే వరల్డ్ కప్ ను కూడా ఇదే స్థాయిలో నెటిజన్లు వీక్షించారు. అప్పట్లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ భారీగానే ఆదాయాన్ని వెనకేసుకొంది.