IND Vs PAK: తొలి మ్యాచ్లో భారత్ బంగ్లాదేశ్ పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరోవైపు సొంత గడ్డపై న్యూజిలాండ్ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్లో పాకిస్తాన్ ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం కానుంది. పాకిస్తాన్ సెమీస్ వెళ్లాలంటే కచ్చితంగా ఈ మ్యాచ్లో గెలుపొందాలి. మరోవైపు సెమీస్ ఆశలను మరింత బలోపేతం చేసుకోవాలంటే టీమిండియా ఈ మ్యాచ్ గెలవాలి. అందువల్లే ఈ మ్యాచ్ కు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది.. 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ చేతిలో ఓడిపోయింది. దీంతో ఈ మ్యాచ్ కు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. గత వన్డే వరల్డ్ కప్, ఇటీవల టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా పాకిస్తాన్ పై విజయం సాధించింది. ఆయనప్పటికీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఓటమి టీమ్ ఇండియాకు మాయని మచ్చ లాగే మిగిలిపోయింది. దీంతో ఇన్ని సంవత్సరాలకు పాకిస్తాన్ జట్టుపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం టీమిండియా కు లభించింది. దీంతో ఎలాగైనా పాకిస్తాన్ పై గెలిచి.. నాటి ఓటమికి రివెంజ్ తీర్చుకోవాలని భావిస్తోంది. మరోవైపు న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన పాకిస్తాన్ జట్టుకు ఈ మ్యాచ్ చావో లాగా మారింది.. తదుపరి మ్యాచులు పాకిస్తాన్ భారత్, బంగ్లాదేశ్ తో ఆడాల్సి ఉంటుంది. ఈ రెండు మ్యాచ్ లలో గెలిచి.. భారత్ – బంగ్లాదేశ్ తన తదుపరి మ్యాచ్లు ఓడిపోతేనే పాకిస్తాన్ జట్టుకు సెమీస్ వెళ్లడానికి అవకాశం ఉంటుంది.
కీలక నిర్ణయం
భారత్ తో జరిగే మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని పాకిస్తాన్ భావిస్తున్నది. ఇందులో బాగానే టీమిండియాతో జరిగే మ్యాచ్ కోసం ప్రత్యేకమైన కోచ్ ను నియమించుకుంది. ప్రస్తుతం పాకిస్తాన్ జట్టుకు తాత్కాలిక హెడ్ కోచ్ గా ఉన్న సెలెక్టర్ అఖీబ్ జావేద్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ జట్టుకు సహాయం అందించేందుకు తన మాజీ సహచరుడు ముదస్సర్ నాజర్(Mudassar Nazar) సహాయం తీసుకున్నాడు. ముదస్సర్ కు అబుదాబి మైదానాలపై మంచి అవగాహన ఉంది. కొన్ని సంవత్సరాలుగా అతడు దుబాయిలో ఉంటున్నాడు. ఐసీసీ గ్లోబల్ అకాడమీలా పనిచేస్తున్నాడు. అకిబ్ జావేద్ కోరిక మేరకు ముదస్సర్ శుక్రవారం పాకిస్తాన్ జట్టుతో కలిసి నెట్ సెషన్ లో పాల్గొన్నాడు. పాక ఆటగాళ్లకు సూచనలు ఇచ్చాడు. నాజర్ ఆల్ రౌండర్ గా ఉన్నాడు. 1993 2001 మధ్యకాలంలో పాకిస్తాన్ జట్టుకు కోచ్ గా పనిచేశాడు. అనంతరం కెన్యా, యూఏఈ జట్లకు కోచ్ గా వ్యవహరించాడు. కుడి చేతి వాటంతో అతడు బ్యాటింగ్ చేస్తాడు.. 76 టెస్టులు ఆడి, 4114 పరుగులు చేశాడు. 122 వన్డేలలో 2,653 రన్స్ చేశాడు. ” నాజర్ సహాయాన్ని పాకిస్తాన్ జట్టు తీసుకుంది. అతడు దుబాయ్ మైదానాలపై స్పష్టమైన అవగాహనతో ఉంటాడు. పైగా అతడికి మెరుగైన రికార్డు ఉంది. అతడు గతంలో అనేక పర్యాయాలు ఈ మైదానాలపై ఆడాడు. కొద్దిరోజులుగా ఐసీసీ గ్లోబల్ అకాడమీలో పనిచేస్తున్నాడు. అతని అనుభవాన్ని పాకిస్తాన్ జట్టు ఉపయోగించుకోవాలనుకుంటున్నది. నెట్స్ లో నాజర్ పాకిస్తాన్ ఆటగాళ్లతో సంప్రదింపులు జరిపాడు. అనేక సూచనలు చేశాడు. భారత ప్లేయర్లను ఎలా ఎదుర్కోవాలో సూచించాడని” పాక్ మీడియా తన కథనాలలో పేర్కొంది.