Sandeep Kishan : యంగ్ హీరో సందీప్ కిషన్(Sandeep Kishan) హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘మజాకా'(Majaka Movie) పై ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన పాటలు, టీజర్ పెద్ద హిట్ అవ్వడంతో అభిమానుల్లో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇప్పటికే ఆడియన్స్ ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vastunnam) సినిమా మూడ్ లోనే ఉన్నారు. చాలా కాలం తర్వాత ఒక చక్కటి కామెడీ ఎంటర్టైన్మెంట్ ని చూసిన అనుభూతిని ఈ సినిమా ద్వారా అందుకున్నారు. ఇలాంటి సినిమాలు తీస్తే బ్రహ్మరథం పడుతామని ఆడియన్స్ చెప్పకనే చెప్పారు. సందీప్ కిషన్ చాలా కాలం నుండి కొడితే బద్దలు అవ్వాలి అనే గురి పెట్టుకున్నాడు. ఈ సినిమా కుంభస్థలం కచ్చితంగా బద్దలు కొడుతోంది అనే బలమైన నమ్మకంతో మూవీ టీం ఉన్నది. ఇంటర్వ్యూస్ లో వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి ఇది చెప్పొచ్చు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే ఎన్ని కోట్లు రాబట్టలో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
సందీప్ కిషన్ గత చిత్రం ‘భైరవ కోన’ బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత వస్తున్న సినిమా కాబట్టి బయ్యర్స్ కూడా భారీ రేట్స్ కి కొనుగోలు చేసారు. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి దాదాపుగా 9 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగిందట. అదే విధంగా వరల్డ్ వైడ్ గా కలిపి 11 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగినట్టు సమాచారం. సందీప్ కిషన్ కి ఈ స్థాయి బిజినెస్ జరగడం ఎక్కువే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫ్లాప్ అయితే జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ లో సగం కూడా రికవరీ చేయలేదు. అదే హిట్ అయితే వంద కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈమధ్య విడుదలయ్యే సినిమాలకు ఆడియన్స్ ఇస్తున్న వెర్డిక్ట్ ఇదే.
సందీప్ కిషన్ సినిమా ఫ్లాప్ అయితే 10 కోట్ల లోపే షేర్ వసూళ్లు వస్తాయి కాబట్టి, 11 కోట్లకు కొన్నారు. పైగా సందీప్ కిషన్ సినిమాలు హిట్ అవుతాయనే గ్యారంటీ లేదు. ఆయన కెరీర్ లో దాదాపుగా 30 సినిమాలు చేస్తే, కేవలం మూడు చిత్రాలు మాత్రమే కమర్షియల్ గా సక్సెస్ అయ్యాయి. ఇక బయ్యర్స్ ఏ ధైర్యం తో పాతిక కోట్ల రూపాయిలు ఈ సినిమా కోసం ఖర్చు చేస్తారు చెప్పండి?, అందుకే కేవలం 11 కోట్ల రూపాయలకు బిజినెస్ జరిగింది. కొంతమంది బయ్యర్స్ అయితే అది కూడా చాలా ఎక్కువ అని అంటున్నారు. అయితే మొన్న విడుదల చేసిన ‘సొమ్మసిల్లి పోతున్నావే’ అనే లిరికల్ వీడియో సాంగ్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సినిమా పై బజ్ కూడా అమాంతం పెరిగేలా చేసింది ఈ పాట. చూడాలిమరి ఓపెనింగ్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది.