Ind Vs Pak: దాయాది జట్ల మధ్య పోరు అంటే ఎప్పుడూ ఉత్కంఠే. భారత్, పాకిస్తాన్ (Ind vs Pak) మ్యాచ్ అంటే చాలు ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంటుంది. ఆ రోజు ఏ పనులున్న పక్కన పెట్టి మ్యాచ్ చూస్తుంటారు క్రికెట్ ప్రియులు.. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారా అన్ని కొన్ని కోట్ల మంది టీవీల ముందు కూర్చుని ఈ మ్యాచ్‌ను వీక్షిస్తారు. ఈ మ్యాచ్‌ను సామాన్య క్రికెట్ ప్రేమికులు మాత్రమే కాదు.. సెలబ్రిటీల సైతం ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్నారు. కొందరు నేరుగా స్టేడియానికి వెళ్లి వీక్షిస్తే.. మరి కొందరు టీవీ, ఓటీటీ ద్వారా చూస్తున్నారు. ఇలా ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి దుబాయ్ స్టేడియంలో మ్యాచ్ వీక్షిస్తూ ప్రత్యక్షమయ్యారు. అలాగే ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా దుబాయ్‌లోని స్టేడియంలో తన కొడుకుతో కనిపించారు.
ఆయనతో పాటు ఇటీవల పుష్ప2 సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న డైరెక్టర్ సుకుమార్, ఏపీ ఎంపీ కేశినేని చిన్ని కూడా కనిపించారు. అలాగే బాలీవుడ్, టాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్న ఊర్వశీ రౌతేలా కనువిందు చేసింది. అలాగే భారత్ లోనే ఎంస్ ధోనీ, నటుడు సన్నీ డియోల్ కలిసి టీవీలో మ్యాచ్ చూస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే కాగా, ప్రస్తుతం భారత బ్యాటర్లు దూకుడుగా ఆడుతున్నారు.
ఈ రోజు మ్యాచ్ ను జియో హాట్ స్టార్ లో రికార్డు సంఖ్యలో జనం చూస్తున్నారు. 56 కోట్ల మంది భారత్ పాక్ మ్యాచ్ ను ఆసక్తిగా చూస్తున్నారు. ఈ లెక్కలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. ఇంత మంది ఒకే సారి మ్యాచ్ తిలకించడం అనేది ఓ రికార్డు. వ్యూయర్ షిప్ గురించి చెప్పాలంటే భారత జనాభాలో 33శాతం, అమెరికా జనాభా కంటే కూడా ఎక్కువ.
ఛాంపియన్స్ ట్రోఫీలో కీలక మ్యాచ్ ప్రస్తుతం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ 241పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ పాకిస్తాన్ కు చాలా ముఖ్యమైంది. ఇందులో ఓడిపోయే సెమీ ఫైనల్ చేరుకునే ఛాన్స్ పోగొట్టుకుని ఇంటి బాట పడుతుంది. ఇందులో టీం ఇండియా గెలిస్తే సెమీ ఫైనల్ కు చేరుకుంటుంది. ప్రస్తుతం భారత బ్యాట్స్ మెన్ అద్భుతంగా ఆడుతున్నారు.