IND Vs NZ: ఛాంపియన్స్ ట్రోఫీలో మరో ఆసక్తికర మ్యాచ్ కు రంగం సిద్ధమైంది.. ఇప్పటికే భారత్, న్యూజిలాండ్ జట్లు ఛాంపియన్ ట్రోఫీలో సెమీఫైనల్ స్థానాలు ఖరారు చేసుకున్నాయి. రెండు జట్లు భీకరమైన ఫామ్ లో ఉన్నాయి. దీంతో పోరు హోరాహోరిగా జరగనుంది. ఈ గ్రూపులో మొదటి స్థానంలో నిలిచిన జట్టు ఆస్ట్రేలియాతో తలపడుతుంది. గ్రూప్ బి లో దక్షిణాఫ్రికా మొదటి స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా రెండవ స్థానంలో ఉంది.
Also Read: ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీ ఫైనల్ పోరు వీటి మధ్యే.. ఇండియాతో తలపడే జట్టు ఏదంటే..
న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్ ద్వారా స్పిన్నర్ల పై తమ ఆట తీరును మరింతగా మెరుగుపరచుకోవాలని భారత ఆటగాళ్లు భావిస్తున్నారు. మరోవైపు రిజర్వ్ ఆటగాళ్లకు అవకాశం కల్పించాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది.. ఇటీవల కాలంలో టీమిండియా బ్యాటర్లు స్పిన్ బౌలర్లను ఎదుర్కోలేక ఇబ్బంది పడిపోతున్నారు.. ఈ క్రమంలో న్యూజిలాండ్ స్టార్ స్పిన్ బౌలర్లు సాంట్నర్, బ్రేస్ వెల్, ఫిలిప్స్ ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది.. రిషబ్ పంత్ శనివారం నెట్స్ లో తీవ్రంగా శ్రమించాడు. ఈ ప్రకారం అతడికి తుది జట్టులో అవకాశం లభించనుంది. వాషింగ్టన్ సుందర్ కూడా ఆడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.. ఇక భారత జట్టు బౌలర్లలో కులదీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా అదరగొడుతున్నారు. భారీగా పరుగులు చేస్తున్న కేన్ విలియంసన్, యంగ్, లాతం, రచిన్ రవీంద్రను ఎలా పడగొడతారనేది చూడాల్సి ఉంది.
రోహిత్ ఆడాల్సిన సమయం వచ్చేసింది..
భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడుగా ఆడుతున్నప్పటికీ.. వాటిని భారీ పరుగులుగా మలచడంలో విఫలమవుతున్నాడు. న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో అతడు భారీ ఇన్నింగ్స్ ఆడాలని అభిమానులు ఆశిస్తున్నారు.. హార్దిక్ పాండ్యా కూడా తన బ్యాటుకు పని చెప్పాల్సి ఉంది. మిడిల్ ఆర్డర్ బలమైన ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. పేస్ బౌలర్ మహ్మద్ షమీ బంగ్లాదేశ్ తో ఐదు వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్నప్పటికీ.. పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో వికెట్లు తీయలేకపోయాడు. హర్షిత్ రాణా పర్వాలేదనే స్థాయిలో బౌలింగ్ వేస్తున్నప్పటికీ.. అతడు వికెట్లు తీయాల్సి ఉంది.
జట్ల అంచనా ఇలా
భారత్: రోహిత్ శర్మ ( కెప్టెన్), గిల్(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్/రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కులదీప్ యాదవ్/ వరుణ్ చక్రవర్తి, మహమ్మద్ షమీ/ అర్ష్ దీప్ సింగ్.
న్యూజిలాండ్
సాంట్నర్(కెప్టెన్), కాన్వే, రచిన్ రవీంద్ర, విలియంసన్, మిచెల్, లాతం, ఫిలిప్స్, బ్రేస్ వెల్, కైల్ జేమిసన్, మ్యాట్ హెన్రీ, ఓ రూర్క్.
మైదానం ఎలా ఉందంటే..
దుబాయ్ మైదానం స్కిన్ బౌలర్లకు అనుకూలిస్తుంది. మంచు ప్రభావం అంతగా లేకపోవడంతో భారత్ తో జరిగిన రెండు మ్యాచ్లలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాయి. ఇక ఆదివారం అయితే 24 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. ఒకవేళ టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గనక గెలిస్తే.. ఈసారి బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.