Kannappa
Kannappa: రెబల్ స్టార్ కృష్ణంరాజు కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం భక్త కన్నప్ప. హీరోగా ఎదుగుతున్న రోజుల్లో భక్త కన్నప్ప చిత్రం కృష్ణంరాజుకి భారీ బ్రేక్ ఇచ్చింది. భక్త కన్నప్ప చిత్రానికి బాపు దర్శకుడు. కన్నడ చిత్రం బేడార కన్నప్ప ఈ చిత్రానికి స్ఫూర్తి. 1976లో భక్త కన్నప్ప విడుదలై విజయం అందుకుంది. కృషంరాజు కెరీర్లో కల్ట్ క్లాసిక్ గా భక్త కన్నప్ప నిలిచిపోయింది. తన నట వారసుడు ప్రభాస్ తో భక్త కన్నప్ప రీమేక్ చేయాలని కృష్ణంరాజు భావించారు. బాహుబలి అనంతరం ఈ కోరిక ఆయనలో మరింత బలపడిందట.
Also Read: రాజమౌళి మహేష్ బాబు ను కొత్త స్టైల్ లోకి మార్చడం వెనక ఇంత కథ ఉందా..?
తన సొంత నిర్మాణ సంస్థలో భక్త కన్నప్ప రీమేక్ ప్రభాస్ తో చేయాలని ఆయన అనుకున్నారు. బాహుబలి అనంతరం ప్రభాస్ భారీ చిత్రాల హీరోగా మారాడు. దాంతో ఒక్కో సినిమాకు ఏళ్ల తరబడి సమయం తీసుకుంటున్నారు. మరోవైపు కృష్ణంరాజు వయసు పెరగడం, ఆరోగ్యం సహకరించకపోవడంతో భక్త కన్నప్ప రీమేక్ కార్యరూపం దాల్చలేదు. 2022లో కృష్ణంరాజు కన్నుమూయడంతో భక్త కన్నప్ప రీమేక్ ఆశలు గల్లంతయ్యాయి.
విష్ణు హీరోగా కన్నప్ప మూవీ ప్రకటన ప్రభాస్ ఫ్యాన్స్ ని ఒకింత అసహనానికి గురి చేసింది. మోహన్ బాబు సైతం ఈ మూవీ ప్రభాస్ చేయాల్సింది, విష్ణు చేస్తున్నాడని అన్నాడు. కన్నప్ప టైటిల్ తో విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఏప్రిల్ 25న థియేటర్స్ లోకి రానుంది. మోహన్ లాల్, ప్రభాస్, కాజల్, అక్షయ్ కుమార్ గెస్ట్ రోల్స్ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో కన్నప్ప మూవీ చేయకపోయినా… ప్రభాస్ గెస్ట్ రోల్ తో ఫ్యాన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
కన్నప్ప మూవీలో ప్రభాస్ శివుడు అనే ప్రచారం జరిగింది. కానీ అక్షయ్ కుమార్ శివుడు పాత్ర చేస్తున్నాడు. ప్రభాస్ రుద్రుడిగా కనిపించనున్నాడట. ఇక రుద్ర పాత్ర కోసం ప్రభాస్ ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదట. కన్నప్ప మూవీ ప్రధాన చిత్రీకరణ న్యూజిలాండ్ లో జరిగింది. విష్ణు కెరీర్లోనే భారీ బడ్జెట్ తో మూవీ నిర్మిస్తున్నారు. కన్నప్ప చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు ప్రభాస్ పౌజీ, రాజా సాబ్ చిత్రాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. కన్నప్ప మూవీ ప్రభాస్ చేస్తే చూడాలన్న ఫ్యాన్స్ కల.. కలగానే మిగిలిపోయింది.
Also Read: తెలుగు లో తమిళ్ డైరెక్టర్ల హవా ఎక్కువవుతుందా..?
Web Title: How did prabhass kannappa movie get into vishnus hands
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com