IND vs NZ: ఇండియా వర్సెస్ న్యూజిల్యాండ్ సెకండ్ టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. మొదటి టెస్టును ఇరుజట్లు డ్రా చేసుకోగా రెండో మ్యాచ్ కీలకంగా మారింది. రెండో టెస్టులో భారత్ తొలుత బ్యాటింగ్ దిగిన భారత్ 325 పరుగులను సాధించింది. మొదటి ఇన్నింగ్స్ లో భారత్ ఈ స్కోరు సాధించడానికి మయాంక్ అగర్వాల్ సెంచరీ తోడ్పడింది. మయాంక్ అగర్వాల్ మొత్తంగా 150 పరుగులు సాధించి ఔట్ అయ్యాడు.
మయాంక్ అగర్వాల్ క్రీజులోకి రావడానికి ముందు జట్టు కష్టాల్లో ఉంది. 80పరుగులకే మూడు కీలక వికెట్లను భారత్ కోల్పోయింది. మొదటి టెస్టులో సెంచరీ చేసిన శ్రేయస్ తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. ఈ సమయంలోనే మయాంక్ అగర్వాల్ కీలక ఇన్నింగ్స్ ను ఆడి భారత్ కు మంచి స్కోరును అందించడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక ఈ మ్యాచ్ కు ముందు భారత జట్టులో అతడి స్థానం ఉంటుందా? ఉండదో అన్న సందేహాలు కలిగాయి. కాన్పూర్ టెస్టులో మయాంక్ రెండు ఇన్నింగ్స్ లో కలిపి కేవలం 30పరుగులే చేశాడు. దీనికితోడు ఫామ్ లేమితో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇదే సమయంలో కేఎల్.రాహుల్, రోహిత్ శర్మ జట్టులోకి వస్తే తన ప్లేస్ ఏంటో తెలియని సందిగ్ధత నెలకొంది. ఇలాంటి సమయంలోనే అతడికి తుది జట్టులో స్థానంలో దక్కింది.
ఈ అవకాశాన్ని మయాంక్ సద్వినియోగం చేసుకున్నాడనే చెప్పొచ్చు. తొలి రోజు ఆట ముగిసిన తర్వాత మయాంక్ మాట్లాడుతూ.. తాను తుది జట్టులో ఎంపికగానే రాహుల్ ద్రవిడ్ దగ్గరకు వెళ్లానని చెప్పాడు. ఆ సందర్భంగా ద్రవిద్ ‘నువ్వు నీ చేతుల్లో ఏదైతో ఉందో అదే చెయ్యి.. నీ కంట్రోల్‌లో ఉండేది నీ బ్యాటింగ్ మాత్రమే.. దాట్లో బెస్ట్‌ను ఇవ్వమన్నాడని’ తెలిపాడు.
తాను మైదానంలోకి రావడానికి ముందే ద్రవిడ్ సలహాను నిజం చేయాలని భావించినట్లు తెలిపాడు. ఇందులో భాగంగానే తన టెక్నిక్ లోపాలపై సీనియర్లు, మాజీ క్రికెటర్లు ఇచ్చిన సలహాలను పాటించినట్లు తెలిపారు. ముఖ్యంగా సునీల్ గవాస్కర్ వీడియోలు చూసిన తర్వాత తన బ్యాటింగ్ కొద్దిగా మార్చుకున్నట్లు వివరించాడు.
Also Read: 10కి పది టీమిండియా వికెట్లు కూల్చిన న్యూజిలాండ్ బౌలింగ్ సంచలనం
గవాస్కర్ తన వ్యాఖ్యానంలో తన బ్యాటింగ్ సమయంలో బ్యాక్ లిఫ్ట్ తగ్గించాలని గతంలో సూచించారు. ఇన్నింగ్స్ ప్రారంభంలో తన బ్యాటును తక్కువ ఎత్తులో ఉంచాలన్నాడనే విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. తాను మరీ ఇంత తక్కువ సమయంలో ఆ స్టాండ్‌ను మార్చలేనని అనిపించిందన్నారు.
అయితే గవాస్కర్ వీడియోలు చూసిన తర్వాత భుజం ఎలా ఉందో గమనించి అలా బ్యాక్ లిఫ్ట్‌ను తగ్గించే ప్రయత్నం చేశానని అది తనకు ఎంతగానో ఉపయోగపడిందని మయాంక్ చెప్పాడు. ఈ టెక్నిక్ తోనే తాను క్రీజులో ఎక్కువసేపు నిలదొక్కుకునే అవకాశం దక్కిందని తెలిపాడు.
Also Read: అ‘ధర’హో అయ్యర్..