India Vs Newzealand: అజాజ్ పటేల్.. ఆడుతున్న న్యూజిలాండ్ జట్టుకు అయిన అతడు భారతీయుడే.. భారతీయ మూలాలున్న ఆటగాడే. కాకపోతే ఆయన తాతలు, తండ్రులు న్యూజిలాండ్ వెళ్లి సెటిల్ కావడంతో అక్కడ ఆడి ఆదేశపు తరుఫున అరంగేట్రం చేశాడు. ఇప్పుడు మాతృదేశం భారత్ పై టెస్ట్ సిరీస్ లో అరంగేట్రం చేశాడు. ఈరోజు అద్భుతమే చేశాడు.
న్యూజిలాండ్ స్పిన్ సంచలనం అజాజ్ పటేల్ టెస్ట్ క్రికెట్ లో చరిత్ర సృష్టించాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో ఏకంగా 10కి పది వికెట్లు కూల్చి సత్తా చాటాడు. ముంబైలో జరుగుతున్న ఈ టెస్టులో మొత్తం భారత బ్యాట్స్ మెన్ ను అజాజ్ పటేల్ ఒక్కడే ఔట్ చేయడం విశేషం.
Also Read: ఆ టెక్నిక్ వల్లే మయాంక్ అగర్వాల్ సెంచరీ చేశాడా?
ఇంతకుముందు ఈ ఘనత సాధించింది కేవలం ఇద్దరు మాత్రమే కావడం గమనార్హం. అందులో ఒకరు మన అనిల్ కుంబ్లే.. 1999లో పాకిస్తాన్ పై 10 వికెట్లు తీశాడు. అంతకుముందు ఇంగ్లండ్ బౌలర్ జిమ్ లేకర్ 1956లో ఆస్ట్రేలియాపై తొలిసారి ఈ రికార్డు సృష్టించాడు.
ఇక న్యూజిలాండ్ తరుఫున అజాజ్ 10 వికెట్లు 119 పరుగులకు ఇచ్చి అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన చేశాడు. ఇక ఈ మ్యాచ్ లో భారత బ్యాట్స్ మెన్ మయాంక్ అగర్వాల్ 150 పరుగులతో చెలరేగడంతో టీమిండియా 325 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అక్షర్ పటేల్ 52 పరుగులతో ఆదుకున్నాడు. న్యూజిలాండ్ ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్ చేపట్టింది.
Also Read: అ‘ధర’హో అయ్యర్..