spot_img
Homeక్రీడలుక్రికెట్‌IND Vs NZ: హర్షిత్ రాణా మీద గౌతమ్ గంభీర్ కు ఎంత ప్రేమో?

IND Vs NZ: హర్షిత్ రాణా మీద గౌతమ్ గంభీర్ కు ఎంత ప్రేమో?

IND Vs NZ:చిన్నపామునైనా సరే పెద్ద కర్రతో కొట్టాలి అంటారు. ఈ నానుడి వెనుక ఎంత లోతైన అర్థం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన శిక్షకుడు గౌతమ్ గంభీర్ కు ఏ మాత్రం అర్థం కావడం లేదు. పైగా ఏకపక్ష నిర్ణయాలతో జట్టును మొత్తం నాశనం చేస్తున్నాడు. ఇప్పటికే టెస్ట్ ఫార్మాట్లో టీమ్ ఇండియా దారుణమైన ఫలితాలను చూస్తోంది. ఇప్పుడు వన్డే ఫార్మాట్లో కూడా అదే స్థాయికి దిగజారే ప్రమాదం కనిపిస్తుంది.

2026 సీజన్లో టీమిండియా ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టుతో తొలి వన్డే సిరీస్ ఆడుతోంది. మొదటి మ్యాచ్లో విజయం సాధించిన టీమ్ ఇండియా.. రెండో మ్యాచ్లో అదే మ్యాజిక్ ప్రదర్శించలేకపోయింది. ముఖ్యంగా బౌలింగ్లో తేలిపోయింది. 284 పరుగులు చేసినప్పటికీ.. ఆ లక్ష్యాన్ని నిలుపుకోలేకపోయింది. టీమిండియా ఇలా ఓడిపోవడానికి ప్రధాన కారణం బౌలర్ల వైఫల్యం. అన్నిటికంటే ముఖ్యంగా బౌలర్లను జట్టులోకి తీసుకునే విషయంలో కోచ్ గౌతమ్ గంభీర్ నిర్లక్ష్యం ఫలితం.. టీమిండియాకు ఓటమిని తెచ్చిపెట్టింది. దీంతో గౌతమ్ గంభీర్ నిర్ణయం పట్ల అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సిరీస్ భవితవ్యాన్ని తేల్చే మూడో మ్యాచ్ లో ఎట్టకేలకు గౌతమ్ గంభీర్ బుద్ధి తెచ్చుకున్నాడు. ఇండోర్ వేదికగా ఆదివారం జరుగుతున్న మూడో వన్డేలో జట్టులో కీలక మార్పుకు శ్రీకారం చుట్టాడు. ముఖ్యంగా బౌలర్ అర్ష్ దీప్ సింగ్ కు అవకాశం కల్పించాడు. ప్రసిద్ కృష్ణ ను పక్కన పెట్టి అర్ష్ దీప్ సింగ్ కు చోటు కల్పించాడు. వాస్తవానికి, హర్షిత్ రాణా పై వేటు వేస్తారని అందరూ అనుకున్నారు. కానీ అతడిని రక్షించే క్రమంలో.. గౌతమ్ గంభీర్.. ప్రసిద్ కృష్ణ ను పక్కనపెట్టి.. అర్ష్ దీప్ సింగ్ ను జట్టులోకి తీసుకున్నాడు. ప్రసిద్ కృష్ణ రెండవ వన్డేలో 9 ఓవర్ల పాటు బౌలింగ్ వేశాడు. 49 పరుగులు ఇచ్చి, ఒక వికెట్ పడగొట్టాడు. హర్షిత్ రాణా ఏకంగా 9.3 ఓవర్లు వేసి 52 పరుగులు ఇచ్చాడు. అతడు కూడా ఒక వికెట్ మాత్రమే తీశాడు. కానీ, హర్షిత్ మీద ప్రేమ చూపించి.. మూడో వన్డేలో ప్రసిద్ కృష్ణ పై వేటు వేశాడు. మ్యాచ్లో టాస్ గెలిచిన టీమ్ ఇండియా బౌలింగ్ ఎంచుకుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi: ఆ 15 ఏళ్ల బుడ్డోడు బ్యాటర్ కాదు డైనమైట్.. టీమిండియా బౌలింగ్ దిగ్గజం షాకింగ్ కామెంట్స్

Vaibhav Suryavanshi: హర్భజన్ సింగ్.. టీమ్ ఇండియాలో లెజెండరీ స్పిన్ బౌలర్. ఆస్ట్రేలియా నుంచి మొదలు పెడితే న్యూజిలాండ్ వరకు ప్రతి జట్టు మీద అతడికి అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. అతడు గూగ్లీ...
Srinivasa Mangapuram

Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాలో ఊహించని సర్ ప్రైజ్ లు…

Srinivasa Mangapuram: మహేష్ బాబు చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన ఎలిమెంట్ ఉంటుంది. ఇక తన అన్న కొడుకు అయిన జయకృష్ణ సైతం ప్రస్తుతం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు....
Gautam Krishna

Gautam Krishna: మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ణ కోసం ముగ్గురు డైరెక్టర్ల ఎదురుచూపు…

Gautam Krishna: రాజకుమారుడు సినిమాతో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన హీరో మహేష్ బాబు... ఆ తర్వాత క్లాస్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమాతో మాస్ హీరోగా అవతరించిన...
Mahesh Babu

Mahesh Babu: మహేష్ బాబు అభిమానులకు చేదు వార్త.. ఊరించి దెబ్బ తీశారుగా..

Mahesh Babu: ప్రతీ ఏడాది మహేష్ బాబు అభిమానులు , తమ అభిమాన హీరో పుట్టినరోజు వేడుకలను ఎంత గ్రాండ్ గా జరిపిస్తారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా బ్యానర్లు...
Jana Nayagan Box Office Collection

Jana Nayagan Box Office Collection: ‘జన నాయగన్ ‘ కి డిజాస్టర్ టాక్.. కానీ మ్యాట్నీ షోస్...

Jana Nayagan Box Office Collection: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళం ,...
Oktelugu Epaper