Chiranjeevi-Harish Shankar: మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ లో తన దూకుడుని పెంచారు. ఇప్పటికే విశ్వంభర అనే సినిమా చేస్తున్న చిరంజీవి ఇప్పుడు హరీష్ శంకర్ డైరెక్షన్ లో మరొక సినిమా చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గా చిరంజీవి కూతురు అయిన సుస్మిత వ్యవహరించనున్నట్టు గా వార్తలేతే వచ్చాయి. కాని రీసెంట్ గా తెలుస్తున్న సమాచారం ప్రకారం సుష్మిత తో పాటు గా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్లు కూడా ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్స్ గా వ్యవహరించనున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
అయితే చిరంజీవి చాలా ఇష్టపడి కళ్యాణ్ కృష్ణ చేత డైరెక్షన్ చేయించాలనుకొని ప్రసన్నకుమార్ బెజవాడ అనే రచయితతో ఒక స్క్రిప్ట్ రెడీ చేయించారు. ఇక ఈ స్క్రిప్ట్ ‘బ్రో డాడీ’ కి రీమేక్ గా మార్పులు చేర్పులు చేస్తూ రాశారు అంటూ వార్తలు కూడా వచ్చాయి. కానీ బోలా శంకర్ సినిమా ప్లాప్ అవ్వడంతో చిరంజీవి రీమేక్ సినిమాలు ఇప్పుడప్పుడే చేయొద్దనే ఉద్దేశ్యంతో ఈ సినిమాని పక్కన పెట్టేశారు. ఇక విశ్వంభర సినిమాలో బిజీగా గడుపుతున్న తను తన కూతురైన సుస్మిత కోరిక మేరకు ఒక సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు.
అయితే సుష్మిత ఇంతకుముందే శ్రీదేవి శోభన్ బాబు అనే సినిమాకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించినప్పటికీ అది పెద్దగా సక్సెస్ సాధించలేదు. దాంతో ఇప్పుడు చిరంజీవి సినిమాకి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తే నేమ్ తోపాటు ఫేం కూడా వస్తుంది. అలాగే తన బ్యానర్ కి కూడా మంచి రేపిటేషన్ పెరుగుతుందనే ఉద్దేశ్యం తోనే తను ఈ ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఖైదీ నెంబర్ 150 సినిమా నుంచి చిరంజీవి చేస్తున్న అన్ని సినిమాలకి సుష్మితనే కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేస్తుంది. ఇక వాళ్ళ నాన్న ప్రోత్సాహంతో ప్రొడ్యూసర్ గా మారిన సుస్మిత మొదటి అడుగులో కొంతవరకు తడబడింది.
కాబట్టి చిరంజీవి ఒక్కసారి తనకు సక్సెస్ ని ఇచ్చి మార్కెట్లోకి వదలాలని చూస్తున్నాడు. ఇక అందులో భాగంగానే ఇప్పుడు హరీష్ శంకర్ చిరంజీవి కాంబో లో చేసే సినిమా ప్రసన్నకుమార్ రాసిన కథతోనే చేస్తున్నారా, లేదంటే హరీష్ శంకర్ సొంత కథతో చేస్తాడా అనే విషయాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు. ఇక ప్రస్తుతం హరీష్ శంకర్ రవితేజతో మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేస్తున్నాడు…