Varun Chakaravarthy
Varun Chakaravarthy: అయితే టీమిండియాలో ఇప్పుడు ఎంట్రీ ఇచ్చిన మిస్టీరియస్ స్పిన్ బౌలర్ వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy) ఆరుదైన ఘనత సాధించాడు. టి20 లలో ఇటీవల ఎంట్రీ ఇచ్చిన అతడు దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లపై అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టి20 సిరీస్ లో ఏకంగా ప్లేయర్ ఆఫ్ ది అవార్డు సొంతం చేసుకున్నాడు. ఇంకా టీమిండి ఆల్రౌండర్ రవీంద్ర జడేజా వరుణ్ చక్రవర్తికి క్యాప్ ఇచ్చి జట్టులోకి ఆహ్వానించాడు.. దీని ద్వారా వరుణ్ చక్రవర్తి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. వన్డే జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన సెకండ్ ఓల్డెస్ట్ ఇండియన్ (second oldest Indian) గా నిలిచాడు.. అంటే లేటు వయసులో భారత వన్డే జట్టులోకి ప్రవేశించిన రెండవ ఆటగాడిగా వరుణ్ చక్రవర్తి నిలిచాడు. 33 సంవత్సరాల 164 రోజుల వయసులో వరుణ్ చక్రవర్తి జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇతడి కంటే ముందు ఫరూక్ ఇంజనీర్ (Farooq engineer) 1974లో జాతీయ వన్డే జట్టులోకి ప్రవేశించాడు. అతడు జట్టులోకి ప్రవేశించే నాటికి 36 సంవత్సరాల 138 రోజుల వయసును కలిగి ఉన్నాడు..
గత 51 సంవత్సరాలలో..
గత 51 సంవత్సరాలలో తొలి ప్లేయర్ గా వరుణ్ చక్రవర్తి రికార్డు సృష్టించాడు.. లీడ్స్ వేదికగా 1974లో టీమిండియా తొలిసారి ఇంగ్లాండ్ జట్టుతో వన్డే మ్యాచ్ ఆడింది. అప్పుడు ఫారుఖ్ ఇంజనీర్ వన్డే జట్టులోకి ప్రవేశించాడు. అప్పుడు అతడి వయసు 36 సంవత్సరాల 138 రోజులు.. ఇక నాటి నుంచి గత 51 సంవత్సరాలలో లేటు వయసులో (33 సంవత్సరాల తర్వాత) ఇంగ్లాండ్ జట్టుపై భారత జట్టు తరఫున వన్డేలలో ఎంట్రీ ఇచ్చిన తొలి ఆటగాడు వరుణ్ చక్రవర్తి కావడం గమనార్హం. మొత్తానికి 33 ఏళ్ల వయసు మించిన తర్వాత ఇంగ్లాండ్ పై భారత జట్టు తరఫున వన్డేలలో ఎంట్రీ ఇచ్చిన ఆటగాళ్లు ఐదుగురు ఉన్నారు. వారిలో ఫరూక్ ఇంజనీర్, వరుణ్ చక్రవర్తి, అజిత్ వాడేకర్, దిలీప్ దోషి, సయ్యద్ అబిద్ అలీ ఉన్నారు.
మిస్టీరియస్ స్పిన్ బౌలర్ గా పేరుపొందిన వరుణ్ చక్రవర్తిని త్వరలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడిస్తారని ప్రచారం జరుగుతున్నది. అందువల్లే అతడిని రెండో వన్డేలోకి తీసుకున్నారని తెలుస్తోంది.. అతడు వేసే బంతులు విభిన్నంగా ఉండడం.. బ్యాటర్లు ఆడేందుకు ఇబ్బంది పడటం.. వంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని టీమిండియా మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దుబాయ్ వేదికగా టీం ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతున్న నేపథ్యంలో.. ఆ మైదానాలపై వరుణ్ చక్రవర్తి రాణిస్తాడని.. టీమిండియా గెలుపులో కీలక భాగం అవుతాడని జట్టు మేనేజ్మెంట్ అంచనా వేస్తోంది.. అందువల్లే అతడికి రెండవ వన్డే మ్యాచ్లో అవకాశం కల్పించినట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు వరుణ్ చక్రవర్తి రెండవ వన్డేలో.. 10 ఓవర్లు బౌలింగ్ చేసి.. 54 పరుగులు ఇచ్చి.. ఒక వికెట్ పడగొట్టాడు.