Kajal Aggarwal
Kajal Aggarwal: యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోయిన్స్ లో ఒకరు కాజల్ అగర్వాల్. లక్ష్మి కళ్యాణం అనే చిత్రంతో వెండితెర అరంగేట్రం చేసిన ఈమె, ఆ తర్వాత కొన్నాళ్ల పాటు చిన్న హీరోల సినిమాలకు మాత్రమే పరిమితమైంది. అలాంటి సమయంలో ఆమెకు కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘చందమామ’ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కింది. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా, కాజల్ అగర్వాల్ ని ప్రతీ తెలుగింట్లో ఒక అమ్మాయిగా మార్చేసింది. ఈ సినిమా తర్వాత ఆమె చేసిన ‘మగధీర’ చిత్రం ఎలాంటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటిని డబుల్ మార్జిన్ తో కొట్టి ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. ఈ సినిమా తర్వాత ఆమె జాతకమే మారిపోయింది.
వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు సంపాదిస్తూ తెలుగు,హిందీ, తమిళ భాషల్లో సూపర్ హిట్స్ ని అందుకుంది. తెలుగు లో ఈమె నేటి తరం స్టార్ హీరోలైన పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ లతో కలిసి సినిమాలు చేసింది. అదే విధంగా సీనియర్ హీరోలలో వెంకటేష్, నాగార్జునలతో తప్ప అందరి హీరోలతో కలిసి సినిమాలు చేసింది. ఇక తమిళం లో రజినీకాంత్ తో తప్ప దాదాపుగా అందరి హీరోలతో కలిసి నటించింది. ఒకప్పుడు ఏడాదికి కనీసం మూడు నుండి నాలుగు సినిమాలు చేస్తూ వచ్చిన కాజల్ అగర్వాల్, ఇప్పుడు ఖాళీ చేతులతో ఇంట్లోనే కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్త హీరోయిన్స్ రాక కారణంగా కాజల్ అగర్వాల్ క్రేజ్ బాగా డౌన్ అయ్యింది. ఆమె తోటి హీరోయిన్స్ సమంత, తమన్నా వంటి వారు ఇప్పటికీ మంచి అవకాశాలతో పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతుంటే, కాజల్ అగర్వాల్ మాత్రం అక్కడే ఆగిపోయింది.
ప్రస్తుతం ఆమె చేతిలో ‘ది ఇండియా స్టోరీ’ అనే చిత్రం మాత్రమే ఉంది. అదే విధంగా సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘సికందర్’ చిత్రంలో కూడా ఈమె ఒక కీలక పాత్ర చేసింది. ఇందులో మెయిన్ హీరోయిన్ గా రష్మిక నటించింది. అయితే చేతిలో పెద్దగా సినిమాలు లేకపోయినా కాజల్ అగర్వాల్ సంపాదన ఇప్పుడు కోట్లలోనే ఉంటుందట. ఎలా అంటే ఈమె పెళ్ళైన తర్వాత అత్యధిక బ్రాండ్స్ కి అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. వాటిని తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేయడం వల్ల, కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్స్ ని ఆమెకు ఇస్తున్నారట. అంతే కాకుండా ఆమె భర్త గౌతమ్ కిచులు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. ఆయనకు సంబంధించిన కొన్ని వ్యాపారాలను కూడా కాజల్ దగ్గరుండి చూసుకుంటుందట. అలా ఆమె ఇప్పుడున్న కుర్ర హీరోయిన్స్ కంటే ఎక్కువ సంపాదిస్తూ ముందుకు దూసుకెళ్తుందని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.