IND vs ENG : తొలి టెస్టులో ట్విస్ట్.. టీంలు ఇవే

టీమిండియా మరో సమరానికి రెడీ అయ్యింది.. ఇంగ్లండ్ తో అమీతుమీ తేల్చుకోవడానికి భారత క్రికెట్ జట్టు రెడీ అయ్యింది. భారత్-ఇంగ్లండ్ ల మధ్య జరుగనున్న ఐదు టెస్టుల సిరీస్ కు రంగం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో నాటింగ్ హమ్ లోని ట్రెంట్ బ్రిడ్జ్ మైదానం వేదికగా ప్రారంభం కానున్న మొదటి టెస్ట్ తో నెలన్నరపాటు సాగుతుంది. ఈ బిగ్ సిరీస్ తో ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ రెండో ఎడిషన్ కు తెరలేవనుంది. దాంతో ఇరు జట్లు […]

Written By: NARESH, Updated On : August 4, 2021 12:41 pm
Follow us on

టీమిండియా మరో సమరానికి రెడీ అయ్యింది.. ఇంగ్లండ్ తో అమీతుమీ తేల్చుకోవడానికి భారత క్రికెట్ జట్టు రెడీ అయ్యింది. భారత్-ఇంగ్లండ్ ల మధ్య జరుగనున్న ఐదు టెస్టుల సిరీస్ కు రంగం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో నాటింగ్ హమ్ లోని ట్రెంట్ బ్రిడ్జ్ మైదానం వేదికగా ప్రారంభం కానున్న మొదటి టెస్ట్ తో నెలన్నరపాటు సాగుతుంది. ఈ బిగ్ సిరీస్ తో ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ రెండో ఎడిషన్ కు తెరలేవనుంది. దాంతో ఇరు జట్లు కూడా విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి.

న్యూజిలాండ్ చేతిలో డబ్ల్యూ.టీసీ ఫైనల్ లో ఓడిన భారత క్రికెట్ జట్టు ఇప్పుడు మళ్లీ సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. అదే టీం చేతిలో సొంతగడ్డపై ఓడిన ఇంగ్లండ్ గాడినపడాలని భావిస్తోంది.

ఇంగ్లండ్ వాతావరణమే ఇప్పుడు అక్కడి మ్యాచ్ పై ప్రధాన అవరోధంగా ఉంది. వర్షం, తేమ కారణంగా మ్యాచ్ లను ఆటంక పరచడం.. విజయాన్ని శాసించేలా ఉంది. ఫస్ట్ టెస్టుకు వర్షం ముప్పు పొంచి ఉందని అంటున్నారు. తేమ, మబ్బులు పట్టి ఉంటుందంటారు. మైదానాన్ని మేఘాలు కమ్ముకొని చల్లని గాలులు వీచే అవకాశం ఉందంటున్నారు. అదే జరిగితే పేసర్ల రాజ్యం నడవనుంది.

ఇక ఇంగ్లండ్ లోని ట్రెంట్ బ్రిడ్జి మైదానం స్వింగ్ బౌలర్లకు స్వర్గధామంగా ఉంది. అప్పుడు ఆతిథ్య బౌలర్లకు అడ్వాంటేజ్ కానుంది. బౌలింగ్ లైనప్ లో స్వింగ్ చేసే బౌలర్ లేడన్నది తప్పితే పెద్దగా లోపాలేవీ లేవు. ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ లతో కూడిన పేస్ బౌలింగ్ తోపాటు అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్ రూపంలో స్పిన్ విభాగం కూడా బలంగానే ఉంది.

సిరాజ్ బాల్ ను స్వింగ్ చేయగలడు. అక్కడి కండీషన్స్ అతడి బౌలింగ్ కు బాగా సూటవుతాయి. డబ్ల్యూ.టీసీ ఫైనల్లో అతడిని తీసుకోకుండా చేసిన పొరపాటును కోహ్లీ ఈసారి రిపీట్ చేయకపోవచ్చని అంటున్నారు.

ఇక భారత్ లో స్పిన్ పిచ్ లతో తమను ఓడించిన టీమిండియాను ఇంగ్లండ్ ఇప్పుడు పచ్చికతో కూడిన పేస్ పిచ్ లపై దెబ్బకొట్టాలని చూస్తోంది. ముఖ్యంగా అండర్సన్, బ్రాడ్ లాంటి సీనియర్ బౌలర్లు ఇండియన్ బ్యాట్స్ మెన్ ను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.

టీమిండియా అంచనా
—————————
భారత్ జట్టు అంచనా ఇదే: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, చతేశ్వర్ పూజారా, అజింక్యా రహానే, రిషబ్ పంత్, శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ/మహ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ, జస్ ప్రీత్ బూమ్రా