
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. రోజువారీ కేసులు నిన్న 30వేలకు దిగిరాగా తాజగా ఈరోజు 42 వేలకు పైగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 42,625 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్తగా 26,668 మంది బాధితులు కోలుకున్నారు. మరోవైపు ఈరోజు 562 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,17,69,132కి చేరింది. ప్రస్తుతం దేశంలో 4,10,353 యాక్టివ్ కేసులు ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.