ఇక ప్రభుత్వం కోసం సీక్రెట్ ఆపరేషన్లు చేసే అన్ సంగ్ హీరోగా అక్షయ్ కనిపించనున్నాడు. ఇలాంటి కథలు అక్షయ్ కి కొత్త కాబట్టి, ఈ సినిమా పై హిందీలో మంచి అంచనాలు ఉన్నాయి. 1984లో జరిగిన ఓ ఫ్లైట్ హైజాక్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని, ఇండియాకి చెందిన విమానాన్ని పాకిస్థాన్ సహకారంతో ఉగ్రవాదులు ఎలా హైజాక్ చేశారు ?
అ విమానంలో ఉన్న 200 మంది ప్రయాణికులను హీరో ఎలా సేవ్ చేశాడు ? అసలు ప్రభుత్వ వర్గాల్లో అక్షయ్ ను బెల్ బాటమ్ అని ఎందుకు పిలుచుకుంటారు ? లాంటి కోణాలను ఇంట్రెస్టింగ్ ప్లేతో దర్శకుడు ట్రైలర్ ను తెలివిగా కట్ చేశాడు. అక్షయ్ కుమార్ తన మిషన్ ను అమల్లో పెట్టె విధానం కూడా చాలా కొత్తగా ఉంటుందట. ముఖ్యంగా హైజాకర్ల ఆట ఎలా కట్టించాడు ?
చివరకు బందీలను ఎలా విడిపించాడు అనేది సినిమాలో వెరీ ఎమోషనల్ గా ఉంటుందట. ఇక అక్షయ్ క్యారెక్టర్ సినిమాలో చనిపోతుంది అని అంటున్నారు. నిజానికి అక్షయ్ గతంలో నటించిన బేబీ, ఎయిర్ లిఫ్ట్ లాంటి సినిమాలు ఈ కోవకు చెందినా.. బెల్‌బాటమ్ మాత్రం పూర్తీ కొత్త సినిమానే. ఇక వచ్చే నెలలో ఈ సినిమాని రిలీజ్ డేట్ సిద్ధం చేస్తున్నారు.