IND Vs ENG: రాజ్‌కోట్ వేదికగా ఇండియా, ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు మూడో రోజు ఆట మొదలైంది. అయితే మూడో రోజు ఆటలో భారత క్రికెటర్లు నల్ల రిబ్బన్లు ధరించి మైదానంలోకి వచ్చారు. దీంతో అంతా ఏమైందని చర్చ జరిగింది. ఏం జరిగిందని ఆరా తీశారు. నెట్టింట్లో సెర్చ్ చేశారు. చివరకు టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజ టెస్‌ట క్రికెటర్ దత్తాజీరావు గైక్వాడ్(95) మృతికి సంతాపంగా భారత ఆటగాళ్లు ఇలా నల్ల రిబ్బన్లు ధరించారని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు.
బీసీసీఐ సూచనతో..
గైక్వాడ్ మృతికి సంతాపంగా క్రికెటర్లు నల్ల రిబ్బన్లు ధరించాలని బీసీసీఐ సూచించింది. ఈమేరకు ట్వీట్ చేసింది. ఇక తద్తాజీరావు గైక్వాడ్ భారత్ తరఫున 11 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఒక హాఫ్ సెంరరీతో 350 పరుగులు చేశాడు. 1952, 1959లో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టులో కీలక ఆటగాడిగా గైక్వాడ్ ఉన్నారు. 1952–53లో వెస్టిండీస్ పర్యటనకు కూడా దత్తాజీ వెళ్లారు. 1959లో ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా టీమిండియాకు సారథ్యం వహించారు.
ఫిబ్రవరి 13న కన్నుమూత..
95 ఏళ్ల దత్తాజీరావు గైక్వాడ్ ఫిబ్రవరి 13న బరోడాలోని తన నివాసంతో కన్నుమూశారు. అయితే ఆయన మరణంపై బీసీసీఐ ఆలస్యంగా స్పందించింది. గైక్వాడ్ మృతికి సంతాప సూచకంగా నల్ల రిబ్బన్లు ధరించాలని ప్రస్తుతం మ్యాచ్ ఆడుతున్న క్రికెటర్లకు సూచించింది. దీంతో ఆట మూడో రోజు భారత ఆటగాళ్లు నల్ల రిబ్బన్లతో కనిపించారు.