IND vs ENG: ఐదు టి 20 మ్యాచ్ల సీరీస్లో భాగంగా ఇంగ్లాండ్ జట్టు భారత్ లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా తొలి టీ20 మ్యాచ్ కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతోంది. తొలి మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత జట్టు కెప్టెన్ తీసుకుని నిర్ణయం సరైనదని బౌలర్లు నిరూపించారు. ఇంగ్లాండ్ జట్టును 132 పరుగులకు ఆల్ అవుట్ చేశారు. ఇంగ్లాండ్ జట్టులో కెప్టెన్ జోస్ బట్లర్(68) మినహా మిగతా వారెవరు రాణించలేదు. ఇండియా బౌలర్లలో మిస్టీరియస్ బౌలర్ వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా, అర్ష్ దీప్ సింగ్, అక్షర్ పటేల్ తలా మూడు వికెట్లు సాధించారు.
తుఫాన్ వేగంతో..
133 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కు తొలి ఓవర్ లో గొప్ప ఆరంభం లభించలేదు. జోప్రా ఆర్చర్ అదిరిపోయే తీరులో బౌలింగ్ వేయడంతో.. స్ట్రైకర్ గా ఉన్న సంజు శాంసన్ పరుగులు తీయడానికి ఇబ్బంది పడ్డాడు. తొలి ఐదు బంతులకు అతడు ఒక్క పరుగు కూడా తీయలేదు. చివరి బంతికి ఒక పరుగు మాత్రమే తీశాడు. ఆ తర్వాత రెండో ఓవర్ అట్ కిన్ సన్ అందుకున్నాడు. ఇక అప్పుడు మొదలైంది సంజు ఊచకోత.. అట్ కిన్ సన్ షార్ట్ పిచ్ మోడ్ లో తొలి బంతి వేయగా.. దానిని సంజు ఫోర్ కొట్టాడు. ఆ తర్వాత అట్ కిన్ సన్ రెండవ బంతిని లెగ్ సైడ్ దిశగా వేయగా.. దానిని కూడా సంజు ఫోర్ కొట్టాడు. మూడో బంతికి అప్రమత్తమైన అట్ కిన్ సన్ .. దానిని హాఫ్ సైడ్ లెంగ్త్ దిశలో వేశాడు. అయితే ఆ బంతికి ఒక్క పరుగు కూడా రాలేదు. నాలుగో బంతిని అట్ కిన్ సన్ షార్ట్ బాల్ రూపంలో వేయగా.. దానిని సంజు సిక్స్ గా మలిచాడు. ఇక ఐదో బంతిని అట్ కిన్ సన్ సరిగ్గానే వేసినప్పటికీ సంజు దానిని బౌండరీ కొట్టాడు. ఇక చివరి బంతిని కూడా సంజు ఫోర్ గా మలచడంతో ఒకే ఓవర్ లో 22 పరుగులు లభించాయి. 20 బంతులు ఎదుర్కొన్న సంజు 4 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 24 పరుగులు చేశాడు. ఆర్చర్ బౌలింగ్లో అట్ కిన్ సన్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఫలితంగా భారత్ 4.2 ఓవర్లలో 41 పరుగులకు ఒక వికెట్ కోల్పోయింది. సూర్య కుమార్ యాదవ్ (0) ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడు.. ఆర్చర్ బౌలింగ్లో క్యాచ్ అవుట్ అయ్యాడు. అభిషేక్ శర్మ (22), తిలక్ వర్మ (4) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 76 పరుగుల దూరంలో ఉంది.