విడుదలకు ముందు ఈ సాంగ్ ప్రోమో ని విన్న తర్వాత, మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ కి ఇలాంటి B గ్రేడ్ పాట ని డిజైన్ చేస్తారా?, త్రివిక్రమ్ కి అసలు ఏమైంది అంటూ పెదవి విరిచారు. కానీ విడుదల తర్వాత ఈ సినిమా ఆంధ్ర ప్రదేశ్ వద్ద ఒక మోస్తారు గా అయినా ఆడిందంటే, అందుకు కారణం ఈ ‘కుర్చీ మడత పెట్టి’ పాట వల్లనే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మహేష్ బాబు నుండి ఈ రేంజ్ మాస్ డ్యాన్స్ స్టెప్పులను ప్రేక్షకులతో పాటు ఆయన అభిమానులు కూడా ఊహించలేదు. శ్రీలీల లాంటి డ్యాన్సర్ తో సమానంగా మహేష్ బాబు డ్యాన్స్ వెయ్యడం అందరినీ షాక్ కి గురి చేసింది. థియేటర్స్ లో ఈ పాటకు ఎంతటి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందో, యూట్యూబ్ లో కూడా అలాంటి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.
రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి అద్భుతమైన డ్యాన్సర్లు కలిసి వేసిన ‘నాటు నాటు’ పాటకు కూడా ఈ రేంజ్ వ్యూస్ యూట్యూబ్ లో రాలేదు. అలాంటిది ‘కుర్చీ మడతపెట్టి’ పాటకు వచ్చింది. యూట్యూబ్ లో ఇప్పటి వరకు ఈ పాటకు 530 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. కేవలం టాలీవుడ్ ఆడియన్స్ చూస్తే వచ్చిన వ్యూస్ కావు ఇవి. గ్లోబల్ వైడ్ గా మూవీ లవర్స్ కి నచ్చడం వల్ల వచ్చిన వ్యూస్ ఇవి. ముఖ్యంగా నేపాల్ దేశంలో యువత ఈ పాటకు ఒక రేంజ్ లో కనెక్ట్ అయిపోయారు. నేపాల్ లోని ఒక రోడ్డు వద్ద ఇద్దరు యువతులు ‘కుర్చీ మడతపెట్టి’ పాటకు డ్యాన్స్ వేస్తూ సోషల్ మీడియా లో ఒక వీడియో ని అప్లోడ్ చేసారు. అంతే కాకుండా ఒక నేపాల్ కాలేజీలో ఈ పాటకు స్టూడెంట్స్ మొత్తం డ్యాన్స్ వేస్తూ సోషల్ మీడియా లో అప్లోడ్ చేసిన వీడియో కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.