https://oktelugu.com/

IND Vs ENG: భారత్ వర్సెస్ ఇంగ్లాండ్.. వన్డేలలో ఎవరిది పై చేయి అంటే..

టీమిండియా(team India) - ఇంగ్లాండ్ జట్లు(England cricket team ( వన్డే సమరంలో పోటీ పడబోతున్నాయి. ఇటీవల జరిగిన టీ - 20 సిరీస్ లో టీమిండియా ఇంగ్లాండ్ జట్టుపై విజయం సాధించింది. 4-1 తేడాతో భారత జట్టు గెలుపును దక్కించుకుంది. ఇదే ఉత్సాహంతో టీమిండియా బరిలోకి దిగుతోంది. ఇంగ్లాండ్ జట్టుపై వన్డే సిరీస్ దక్కించుకోవాలని భావిస్తోంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : February 6, 2025 / 10:47 AM IST
    IND Vs ENG (3)

    IND Vs ENG (3)

    Follow us on

    IND Vs ENG: క్రికెట్ పుట్టింది ఇంగ్లాండ్ జట్టులోనైనా.. ఇంగ్లాండ్ జట్టుపై ప్రారంభం నుంచి ఆధిపత్యం ఇండియాదే. భారత్ – ఇంగ్లాండ్ జట్ల మధ్య ఇప్పటివరకు 107 వన్డేలు జరిగాయి. వీటిలో టీమిండియా 58 మ్యాచ్లలో విజయం సాధించింది. ఇంగ్లాండ్ 44 మ్యాచ్లలో గెలుపును దక్కించుకుంది. రెండు మ్యాచ్లు టై అయ్యాయి. మరో మూడు మ్యాచులు రద్దయ్యాయి. స్వదేశంలో 52 మ్యాచులు జరగగా.. ఇందులో భారత్ 34 మ్యాచ్లలో విజయం సాధించింది.. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ పరంగా భారత జట్టు ఇంగ్లాండ్ కంటే మెరుగ్గా ఉంది. ఇప్పుడే కాదు ప్రారంభం నుంచి కూడా ఇండియా ఇదే జోరు కొనసాగిస్తోంది.. ఇంగ్లాండ్ జట్టుపై వారి సొంత దేశంలోనూ.. భారత గడ్డ పైనా టీమిండియాకు తిరుగులేని రికార్డులు ఉన్నాయి. కీలకమైన మ్యాచ్లలో ఇంగ్లాండ్ జట్టుపై భారత్ అనేక పర్యాయాలు గెలిచింది. ఒత్తిడి మధ్య ఇంగ్లాండ్ చిత్తవ్వగా.. భారత్ మాత్రం దానిని అధిగమించి విజయాలు సాధించింది. అందువల్లే భారత్ – ఇంగ్లాండ్ జట్ల మధ్య సిరీస్ అంటే ఇండియానే హాట్ ఫేవరెట్ గా ఉంటుంది. ” భారత జట్టుతో మ్యాచ్ అంటే చాలు ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఎందుకో తెలియని ఒత్తిడికి గురవుతుంటారు. పరుగులు చేయడంలో.. వికెట్లు తీయడంలో ఇబ్బంది పడుతుంటారు. దానిని భారత జట్టు క్యాష్ చేసుకుంటుంది. అనుకూలంగా మలుచుకుని మెరుగైన ఫలితాలు రాబడుతుందని” క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

    నాగ్ పూర్ మైదానం ఎలా ఉందంటే..

    దాదాపు ఆరు సంవత్సరాల గ్యాప్ తర్వాత నాగ్ పూర్ మైదానంలో భారత్ – ఇంగ్లాండ్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరుగుతుంది.. నాగపూర్ ప్రాంతంలో ప్రస్తుతం వాతావరణం పూర్తి పొడిగా ఉంది. మధ్యాహ్నం ఒంటిగంట 30 నిమిషాలకు ఈ మ్యాచ్ మొదలవుతుంది.. మైదానం మీద తేమ అంతంతమాత్రంగానే ఉండడంతో… పేస్ బౌలర్లు బంతిపై పట్టు సాధించడానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది.. స్పిన్ బౌలర్లు మాత్రం ఈ మైదానంపై మాయాజాలం ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది.. బంతిపై పట్టు సాధిస్తే చాలు స్పిన్నర్లు చెలరేగుతారు.. ఇక ఈ మైదానంపై తొలి ఇన్నింగ్స్ ఆడిన జట్టు సగటు 288 పరుగులు.. అయితే ఈ టార్గెట్ ను చేజ్ చేయడం కాస్త కష్టమే. ఎందుకంటే మ్యాచ్ డే అండ్ నైట్ ఫార్మాట్లో జరుగుతుంది కాబట్టి.. సెకండ్ ఇన్నింగ్స్ ఆడే జట్టు కాస్త జాగ్రత్తతో ఉండాలి. ఎందుకంటే మంచు కురవడం వల్ల బంతి ఒక్కసారిగా టర్న్ అవుతుంది. అప్పుడు బ్యాటర్లకు పరుగులు చేయడం ఇబ్బంది అవుతుంది. బౌలర్లకు బంతిపై పట్టు చిక్కుతుంది కాబట్టి వికెట్లు తీయడానికి సులభం అవుతుంది. అందువల్లే నాగపూర్ మైదానాన్ని మిస్టీరియస్ స్టేడియం అని పిలుస్తుంటారు.. మరి ఈ మైదానంపై భారత జట్టు ఎలాంటి ప్రదర్శన చేస్తుందోనని అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.. మరోవైపు టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.