Rajamouli , Mahesh Babu
Rajamouli and Mahesh Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టూడెంట్ నెంబర్ వన్ (Student Number one) సినిమాతో దర్శకుడిగా పరిచయమైన రాజమౌళి(Rajamouli)…ఆ తర్వాత చేసిన వరుస సినిమాలతో సూపర్ డూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతూ వస్తున్నాడు. మరి ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఆయన కంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా తీసుకొచ్చి పెట్టాయి. ఇక బాహుబలి(Bahubali) సినిమాతో పాన్ ఇండియాలోకి అడుగుపెట్టిన ఆయన తనను మించిన దర్శకుడు ఇంకెవరూ లేరు అనేంత రేంజ్ లో సినిమాను చేశాడు. ఇక 1900 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టిన ఏకైక తెలుగు దర్శకుడు కూడా రాజమౌళినే కావడం విశేషం… ఇలాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండటం వల్లే మన ఇండస్ట్రీ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ కి వెళ్ళింది. అలాగే ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న సినిమాతో పాన్ వరల్డ్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ను తీసుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే ప్రియాంక చోప్రా, రాజమౌళి, కీరవాణి ముగ్గురు కలిసి ఒక ఫోటో దిగారు. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇక ఇది చూసిన మహేష్ బాబు అభిమానులు మాత్రం దానిమీద మీమ్స్ అయితే ఎక్కువగా స్ప్రెడ్ చేస్తున్నారు.
అదేంటి అంటే ప్రియాంక చోప్రా తో ఫోటో దిగారు ఇంతకీ మా మహేష్ బాబు ఎక్కడున్నాడు అంటూ ఒక మేమైతే విపరీతంగా వైరల్ అవుతుంది. ఇక మరి కొంతమంది దానికి కౌంటర్ ఇస్తూ ఆ ఫోటో తీసింది మహేష్ బాబే అంటూ కొన్ని కామెంట్లైతే చేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా ప్రియాంక చోప్రా వచ్చిన తర్వాత రాజమౌళి మహేష్ బాబును పెద్దగా పట్టించుకోవడం లేదనే వార్తలు అయితే ఎక్కువగా వినిపిస్తున్నాయి.
నిజానికి సూపర్ స్టార్ అయిన మహేష్ బాబు ఈ సినిమా కోసం దాదాపు మూడు సంవత్సరాల వరకు రాజమౌళికి డేట్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్న మహేష్ బాబు ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు. అందుకోసమే రాజమౌళి అడిగినన్ని డేట్స్ అయితే ఇచ్చేశాడు. మరి ఈ కాంబోలో వస్తున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది. తద్వారా ఆయన చేయబోతున్న ఈ ప్రయత్నం ఏ రేంజ్ లో సక్సెస్ అవ్వబోతుందనేది తెలియాల్సి ఉంది…