Sankranthiki Vastunnam
Sankranthiki Vastunnam : తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే కమర్షియల్ డైరెక్టర్లు చాలామందికి గుర్తొస్తుంటారు. ముఖ్యంగా అనిల్ రావిపూడి (Anil raavipudi)లాంటి దర్శకుడు సైతం కమర్షియల్ సినిమాలు చేయడమే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకున్నాడు. కాబట్టి ఆయన నుంచి వచ్చే సినిమాలు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇక రీసెంట్ గా వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టిస్తూ వందల కోట్ల కలెక్షన్స్ ను రాబడుతున్నాడు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ (Venkatesh) కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఫ్యామిలీ సినిమాలను చేస్తూ తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న ఆయన ప్రస్తుతం మంచి సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉండడం విశేషం… మరి ఏది ఏమైనా కూడా ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక రీసెంట్ గా ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vastunnam)సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న ఆయన భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్నాడు. తన కెరియర్ లోనే భారీ కలెక్షన్స్ ను వసూలు చేసిన సినిమాగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ నిలవడం చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఇప్పటివరకు ఈజీగా 305 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా రిలీజ్ అయిన 24వ రోజు కూడా రెండు కోట్ల కలెక్షన్స్ ను సాధిస్తూ ముందుకు సాగుతుందంటే మామూలు విషయం కాదు…మరి ఈ సినిమాతో వెంకటేష్ 300 కోట్ల క్లబ్ లో చేరిపోవడం అతని అభిమానులను ఆనంద పడేలా చేస్తుంది. ఇక అలాగే అనిల్ రావిపూడి సైతం 300 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. మరి ఏది ఏమైనా కూడా తెలుగులో మాత్రమే రిలీజ్ అయిన ఈ సినిమా 300 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టడం అనేది మామూలు విషయం కాదు. మరి ఇలాంటి సందర్భంలో ఈ సినిమా సక్సెస్ టాక్ సంపాదించుకోవడమే కాకుండా ఈ సంక్రాంతి విన్నర్ గా కూడా నిలిచింది. ఇక భారీ బడ్జెట్ తో సినిమాలను చేసి డబ్బులు పోగొట్టుకునే కంటే 100 కోట్ల లోపు సినిమాలు చేసి 300 నుంచి 400 కోట్ల కలెక్షను రాబట్టే సినిమాలను చేయడం ఉత్తమం అని ప్రొడ్యూసర్లు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకే అనిల్ రావిపూడి లాంటి దర్శకుడికి ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి డిమాండ్ అయితే పెరిగింది. మరి ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక తను చిరంజీవితో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. మరి ఈ సినిమాతో కూడా మరో బ్లాక్ బస్టర్ సక్సెస్ ను సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…ఒకవేళ ఈ సినిమాతో సూపర్ హిట్ సాధిస్తే మాత్రం ఆయనకి ఇండస్ట్రీ లో తిరుగుండదనే చెప్పాలి…చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు అనేది…