IND Vs ENG: రవిచంద్రన్ అశ్విన్ ఆట “అనైతికం”.. భారత జట్టుకు ఎంపైర్ ఫెనాల్టీ.. ఇంగ్లాండ్ కు ఎలా లాభమంటే?

ఓవర్ నైట్ స్కోర్ 326/5 తో శుక్రవారం రెండవ రోజు ఆట ప్రారంభించిన టీమిండియా భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. లంచ్ విరామానికి 7 వికెట్ల నష్టానికి 380 పరుగులతో నిలిచింది.

Written By: Suresh, Updated On : February 16, 2024 2:12 pm

IND Vs ENG

Follow us on

IND Vs ENG: ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ జట్టు భారతదేశంలో పర్యటిస్తోంది. ఇప్పటికే రెండు టెస్టులు పూర్తయ్యాయి. మొదటి టెస్ట్ ఇంగ్లాండ్, రెండవ టెస్ట్ భారత్ గెలుచుకున్నాయి. రాజ్ కోట్ వేదికగా గురువారం నుంచి మూడవ టెస్ట్ మొదలైంది. తొలిరోజు బ్యాటింగ్ చేసిన ఇండియా ఐదు వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. తొలి రోజు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. క్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (131), రవీంద్ర జడేజా (112) పరుగులతో కదం తొక్కారు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్ కు 204 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

ఓవర్ నైట్ స్కోర్ 326/5 తో శుక్రవారం రెండవ రోజు ఆట ప్రారంభించిన టీమిండియా భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. లంచ్ విరామానికి 7 వికెట్ల నష్టానికి 380 పరుగులతో నిలిచింది. ఈ క్రమంలో భారత జట్టు ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ అనైతికమైన ఆట తీరు ప్రదర్శించడంతో ఎంపైర్ మందలించాడు.. భారత జట్టుకు ఐదు పరుగుల ఫెనాల్టీ విధిస్తున్నట్టు ఎంపైర్ జోయల్ విల్సన్ ప్రకటించాడు. దీంతో రవిచంద్రన్ అశ్విన్ ఎంపైర్ తో వాగ్వాదానికి దిగాడు. కారణమేమిటో చెప్పాలని అడిగాడు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో సాధారణంగా ఆటగాళ్లకు ఎంపైర్ ముందుగా వార్నింగ్ ఇస్తారు. ఆ తర్వాత అదే పరిస్థితి మళ్ళీ ఎదురైతే ఫెనాల్టీ విధిస్తారు. రవిచంద్రన్ అశ్విన్ విషయంలో కూడా ఎంపైర్ ఇదే చేసినట్టు తెలుస్తోంది.

తొలి రోజు ఆటలో కూడా ఎంపైర్లు ఇదే కారణంతో రవీంద్ర జడేజాను మందలించారు. మిడిల్ పిచ్ పై పరుగులు తీస్తున్నావంటూ అతడిని హెచ్చరించారు. రవిచంద్రన్ అశ్విన్ కూడా శుక్రవారం అదే తీరుగా పరుగులు తీయడంతో ఎంపైర్లు తీవ్రంగా పరిగణించారు. భారత జట్టు కు ఫెనాల్టీ విధించారు. ఈ ఫెనాల్టీ వల్ల ఇంగ్లాండ్ జట్టు 5/0 తో ఇన్నింగ్స్ ప్రారంభించనుంది. శుక్రవారం ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే భారత జట్టు వెంట వెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. నైట్ వాచ్ మన్ గా వచ్చిన కులదీప్ యాదవ్ (4) ను జేమ్స్ అండర్సన్ ఔట్ చేశాడు. ఆ తర్వాత ఓవర్లో రవీంద్ర జడేజాను (112) ను జో రూట్ బోల్తా కొట్టించాడు. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన ఆరంగేట్ర ఆటగాడు ధృవ్ (25) రవిచంద్రన్ అశ్విన్ (24) పరుగులు చేసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు.

ఎందుకు పెనాల్టీ విధిస్తారంటే..

మైదానంపై ఉన్న రక్షణ ప్రాంతంలో పరుగులు తీయడాన్ని ఎంపైర్లు తీవ్రంగా పరిగణిస్తారు. దీనిని అనైతిక ఆట అంటారు. మైదానానికి ఉద్దేశపూర్వకంగా నష్టం కలిగించే విధానమని దీనిని భావిస్తారు. స్ట్రైకర్ బంతిని ఆడేటప్పుడు రక్షణాత్మక ప్రాంతంలోకి వస్తే వెంటనే అక్కడి నుంచి కదలాలి. ఎలాంటి కారణం లేకుండా బ్యాటర్ ఆ ప్రాంతంలోకి వస్తే అంపైర్ దానిని తప్పుగా భావిస్తాడు. ముందుగా హెచ్చరికలు జారీ చేస్తాడు. రెండోసారి కూడా ఇదే తప్పు పునరావృతమైతే 5 పరుగుల ఫెనాల్టీ విధిస్తాడు. గురువారం రవీంద్ర జడేజా ఇదే తీరుగా పరుగులు తీయడంతో అంపైర్ హెచ్చరించాడు. శుక్రవారం రెండవ రోజు కూడా రవిచంద్రన్ అశ్విన్ ఇలాగే పరుగులు తీయడంతో అంపైర్ ఐదు పరుగుల ఫెనాల్టీ విధించాడు.