https://oktelugu.com/

Ind vs Ban : గ్వాలియర్ లో తిప్పేసిన భారత బౌలర్లు.. సూర్య సేన ఎదుట బంగ్లాదేశ్ విధించిన టార్గెట్ ఎంతంటే..

దాదాపు 14 సంవత్సరాల తర్వాత గ్వాలియర్లో టీమ్ ఇండియా తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతోంది. దీంతో ఆ ప్రాంత అభిమానులు టీమిండియా ప్రదర్శన పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. వారి అంచనాలకు తగ్గట్టుగానే సూర్య కుమార్ నేతృత్వంలోని టీమ్ ఇండియా అద్భుతమైన ప్రదర్శన చూపించింది. బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న తొలి టి20 లో సూపర్ బౌలింగ్ తో ఆకట్టుకున్నది.

Written By:
  • NARESH
  • , Updated On : October 6, 2024 9:16 pm

    mayank yadav

    Follow us on

    Ind vs Ban : దాదాపు 14 సంవత్సరాల తర్వాత గ్వాలియర్లో టీమ్ ఇండియా తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతోంది. దీంతో ఆ ప్రాంత అభిమానులు టీమిండియా ప్రదర్శన పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. వారి అంచనాలకు తగ్గట్టుగానే సూర్య కుమార్ నేతృత్వంలోని టీమ్ ఇండియా అద్భుతమైన ప్రదర్శన చూపించింది. బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న తొలి టి20 లో సూపర్ బౌలింగ్ తో ఆకట్టుకున్నది. మాధవరావు సింధియా మైదానం వికెట్ కు సహకరిస్తున్న నేపథ్యంలో.. టాస్ గెలిచిన సూర్య కుమార్ యాదవ్ బౌలింగ్ వైపు ఆసక్తి చూపించాడు. దీంతో బంగ్లాదేశ్ ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. కెప్టెన్ నిర్ణయం సరైనదేనని అర్ష్ దీప్ సింగ్ నిరూపించాడు. తన వేసిన తొలి ఓవర్ ఐదో బంతికే లిటన్ దాస్(4) ను అవుట్ చేశాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్ పతనం క్రమంగా సాగింది. అర్ష్ దీప్ సింగ్ .. పర్వేజ్ హొస్సెన్, ముస్తాఫిజుర్ రెహమాన్ ను అవుట్ చేసి.. మూడు వికెట్లను దక్కించుకున్నాడు.. మరోవైపు వరుణ్ చక్రవర్తి కూడా తౌహీద్, జుకర్ అలీ, రిషద్ ను అవుట్ చేసి.. మూడు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు . మాయాంక్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, హార్థిక్ పాండ్యా తలా ఒక వికెట్ సొంతం చేసుకున్నారు. పూర్తిగా యువ జట్టు కావడం.. బౌలర్లు ఐపీఎల్లో సత్తా చాటిన అనుభవాన్ని బంగ్లాదేశ్ పై ఉపయోగించారు. ఫలితంగా. పర్యాటక జట్టు వణికిపోయింది. ఏ దశలోనూ ఆతిధ్య జట్టు బౌలర్లను ప్రతిఘటించలేకపోయింది. బంగ్లాదేశ్ జట్టులో హాసన్ మిరాజ్ (35) టాప్ స్కోరర్ గా నిలిచాడు. శాంటో 27 పరుగులతో ఆకట్టుకున్నారు. మిగతా వారంతా భారత బౌలర్ల ఎదుట పూర్తిగా చేతులెత్తేశారు. ఫలితంగా బంగ్లాదేశ్ 19.5 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌట్ అయింది.

    వినియోగించుకున్నారు

    మైదానంపై ఉన్న తేమను భారత బౌలర్లు పూర్తిగా వినియోగించుకున్నారు.. పేస్ బౌలర్లు బంతితో బౌన్స్ రాబట్టారు. బంగ్లా బ్యాటర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. వాస్తవానికి పూర్తిగా యువకులతో నిండిన భారత జట్టును.. అనుభవమున్న బంగ్లా ఆటగాళ్లు ఇబ్బంది పెడతారని అందరూ అనుకున్నారు. కానీ వాస్తవంలో జరిగింది వేరు. అనుభవం ఉన్న బంగ్లా ఆటగాళ్లకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. పదునైన షార్ట్ పిచ్ బంతులు వేస్తూ వణికించారు. అయితే ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా కంటే ఐపీఎల్లో సత్తా చాటిన అర్ష్ దీప్ సింగ్ , వరుణ్ చక్రవర్తి మెరుగైన బంతులు వేసి వికెట్లు తీయడం విశేషం. అయితే తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి రెండు ఓవర్లు వేసి 17 పరుగులు ఇచ్చాడు.. వికెట్లు మాత్రం దక్కించుకోలేకపోయాడు. అనంతరం 128 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు వికెట్లేమీ నష్టపోకుండా 16 పరుగులు చేసింది. క్రీజ్ లో సంజు సాంసన్ (9), అభిషేక్ శర్మ (7) ఉన్నారు.