https://oktelugu.com/

Rajamndri : పిల్లలు లేక చాలామంది బాధపడుతుంటే.. ఒళ్ళు కొవ్వెక్కి వీళ్లు చేసిన పని ఎంతటి దారుణానికి దారి తీసిందంటే..

ఈ భూమ్మీద పెళ్లయి.. సంవత్సరాలు గడిచినా పిల్లలు కలగక.. చాలా జంటలు ఇబ్బంది పడుతున్నాయి. పిల్లలు కలిగేందుకు నానా తంటాలు పడుతున్నాయి. ఫెర్టిలిటీ సెంటర్, ఇతర ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నాయి.

Written By:
  • NARESH
  • , Updated On : October 6, 2024 / 09:00 PM IST

    They get pregnant in haste without marriage and abandon the children

    Follow us on

    లక్షలకు లక్షలు ఖర్చుపెట్టినా పిల్లలు కలగపోవడంతో పెళ్లయిన దంపతులు నరకం చూస్తున్నారు. ఇక పిల్లలు లేకుంటే ఈ సమాజం ఎలాంటి మాటలు మాట్లాడుతుందో తెలియనిది కాదు. కొన్ని ప్రాంతాలలో పిల్లలు లేని దంపతులను పేరంటాలకు, ఇతర వేడుకలకు ఆహ్వానించరు. ఇది ఒక రకంగా ఆ దంపతులకు ఇబ్బందికర పరిణామం. అటు పిల్లలు లేక.. ఇటు సమాజం నుంచి చీత్కారం తట్టుకోలేక ఆ దంపతులు పడే వేదన అంతా ఇంతా కాదు. ఇలాంటి పరిస్థితులు ఉన్నచోట కొందరు మాత్రం దారుణంగా ప్రవర్తిస్తున్నారు. పుట్టిన పిల్లల్ని నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద వదిలేస్తున్నారు. లేదా కంపచెట్లల్లో పడేస్తున్నారు. పిల్లలు లేక కొంతమంది బాధపడుతుంటే.. పిల్లల్ని కానీ కొంతమంది అర్ధాంతరంగా రోడ్డుమీద పడేస్తున్నారు. ఇలాంటి సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగరంలోని తుమ్మల వీధిలో జరిగింది.. ఈ ప్రాంతంలో అప్పుడే పుట్టిన ఆవరణలో ఉంచి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వెళ్లిపోయారు.. అయితే ఆ శిశువు అప్పటికే చనిపోయాడు. అయితే ఆ ఇంటి యజమాని ఆ పసి గుడ్డును చూసి రైతు బజార్ పక్కన ఉన్న శతక పడేసినట్టు తెలుస్తోంది.

    తుమ్మ లోవ మూడవ అడ్డవీధి లో..

    ఈ సంఘటన తుమ్మలోవ మూడవ అడ్డవీధిలో జరిగింది. చనిపోయిన ఆ పసి గుడ్డును కుక్కలు పీక్కుతింటున్నాయి. దీనిని గమనించిన రైతు బజార్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ పసి గుడ్డును చూసి స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. రాజమండ్రి మూడో నగర పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. సిసి ఫుటేజ్ పరిశీలించగా.. అప్పుడే పుట్టిన పసి గుడ్డును తీసుకొచ్చి ఈ ఇంట్లో వదిలినట్టు పోలీసులు చెబుతున్నారు..”పిల్లలు లేక చాలా మంది బాధపడుతున్నారు. సంతానం కలిగే భాగ్యం లేకపోవడంతో ఇతరుల పిల్లల్ని దత్తత తీసుకుంటున్నారు. కొంతమంది ఫెర్టిలిటీ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది ఒళ్ళు కొవ్వెక్కి చేసిన పనుల వల్ల పిల్లలు పుడితే.. వారిని ఇలా వదిలేస్తున్నారు. ఇలాంటి వారిపై ఏమాత్రం జాలి చూపించకూడదు. కఠిన చర్యలు తీసుకోవాలి. ఆ పసి గుడ్డు ను కన్నతల్లి అలా కర్కషంగా ఎలా ఉంటుంది? మరీ ఇంత దారుణమా? మానవత్వం చచ్చిపోతున్నది. మనిషి అనేవాడు మూర్ఖుడిలాగా మారిపోతున్నాడు. ఇలాంటి సంఘటనలు చూసిన తర్వాత.. అలాంటి దారుణాలకు పాల్పడిన వ్యక్తులపై కఠినాతి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని” స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అయితే సిసి ఫుటేజ్ లో ఆ శిశువును అక్కడ వదిలి వెళ్లిన వారిని పోలీసులు గుర్తించారని.. వారి జాడ కోసం గాలింపు మొదలు పెట్టారని తెలుస్తోంది.