IND vs AUS: బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టుకు ఓపెనర్లు మెరుగైన ఆరంభాన్ని అందివ్వలేదు. కూపర్ కొనిల్లే, హెడ్ ఓపెనర్లుగా బ్యాటింగ్ కు దిగారు.. కొనిల్లే (0) షమీ బౌలింగ్లో కేఎల్ రాహుల్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా నాలుగు పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన స్మిత్ (29*) జాగ్రత్తగా ఆడటం మొదలుపెట్టాడు. హెడ్ (39), స్మిత్ జోడి రెండో వికెట్ కు 32 బంతుల్లోనే 50 పరుగులు జోడించారు. ముఖ్యంగా హెడ్ దూకుడుగా ఆడాడు. ఫోర్లు, సిక్సర్లు కొడుతూ భారత బౌలర్లను బెంబేలెత్తించాడు.. హెడ్ వచ్చి రాగానే దూకుడుగా ఆడటం మొదలుపెట్టాడు. అయితే అతడికి అప్పటికే రెండు జీవధానాలు లభించాయి. షమీ బౌలింగ్లో క్యాచ్ అండ్ బౌల్డ్ ను హెడ్ తప్పించుకున్నాడు. తర్వాత అతడి ఓవర్ లోనే రన్ అవుట్ ను వెంట్రుక వాసి దూరంలో తప్పించుకున్నాడు..
వరుణ్ చక్రవర్తి రాకతో
షమీ, హార్దిక్ పాండ్యా, కులదీప్ యాదవ్ బౌలింగ్లో హెడ్ దూకుడుగా ఆడుతుండడంతో.. కెప్టెన్ రోహిత్ శర్మ వరుణ్ చక్రవర్తిని రంగంలోకి దింపాడు. 8.2 ఓవర్లో హెడ్ గిల్ పట్టిన అద్భుతమైన క్యాచ్ ద్వారా పెవిలియన్ చేరుకున్నాడు. వరుణ్ చక్రవర్తి వేసిన బంతిని తప్పుగా అంచనా వేసిన హెడ్ భారీ షాట్ కొట్టడానికి ప్రయత్నించాడు. కాకపోతే ఆ బంతి గాల్లో లేచి బౌండరీ లైన్ వద్ద ఉన్న గిల్ చేతిలో పడింది. దీంతో భారత ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది. సర్టిఫికెట్ పడగొట్టడానికి రోహిత్ శర్మ చేసిన ప్రయత్నం ఫలించింది. తను వేసిన తొలి ఓవర్ రెండో బంతికే హెడ్ వికెట్ తీయడంతో వరుణ్ చక్రవర్తి ఒక్కసారిగా నేషనల్ హీరో అయిపోయాడు. హెడ్ వికెట్ పడగొట్టిన నేపథ్యంలో వరుణ్ చక్రవర్తి పై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో హెడ్ వీర విహారం చేయడం వల్లే టీమిండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇక వరుణ్ చక్రవర్తి న్యూజిలాండ్ జట్టుతో జరిగిన లీగ్ మ్యాచ్లో ఐదు వికెట్లు పడగొట్టి ఒక్కసారిగా సంచలన బౌలర్ అయిపోయాడు. దీంతో అతడిని ఆస్ట్రేలియా తో జరుగుతున్న మ్యాచ్ లోకి టీమిండియా మేనేజ్మెంట్ తీసుకుంది. దానికి తగ్గట్టుగానే వరుణ్ చక్రవర్తి బౌలింగ్ వేయడంతో హెడ్ వికెట్ త్వరగానే పడింది. హెడ్ అవుట్ అయిన అనంతరం స్టేడియంలో ఒకసారి గా సంబరాలు వెల్లి విరిసాయి. టీం ఇండియా అభిమానులు పట్టరాని ఆనందంతో గంతులు వేశారు.
Also Read : రోహిత్.. నువ్వు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతే కుదరదు.. చివరి వరకు ఆడాలి..
VARUN CHAKRAVARTHY IS A NATIONAL HERO…!!! pic.twitter.com/BRe552Gfdn
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 4, 2025