Karthi
Karthi : ప్రముఖ తమిళ హీరో కార్తీ(Karthi Sivakumar) కి షూటింగ్ లో తీవ్రమైన గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఆయన ‘సర్దార్ 2′(Sardar 2 Movie) లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మైసూరు లో జరుగుతుంది. ఒక కీలకమైన పోరాట సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో కార్తీ కాళ్ళకు గాయాలయ్యాయి. స్పాట్ లోనే ఆయన కుప్పకూలిపోవడంతో వెంటనే అతన్ని సమీపం లో ఉన్న హాస్పిటల్ కి తరలించారు. అక్కడ ఆయనకు పరీక్షలు చేసి, చికిత్స చేసిన అనంతరం, విశ్రాంతి అవసరమని చెప్పుకొచ్చారు. దీంతో ‘సర్దార్ 2’ షూటింగ్ కి కొన్ని రోజుల పాటు బ్రేక్ పడింది. మైసూరుకి చేరుకున్న కార్తీ కుటుంబ సభ్యులు, ఆయన్ని చెన్నై కి తరళించారు. అయితే కార్తీ కి ఇలా ప్రమాదం జరిగింది అనే విషయాన్ని తెలుసుకున్న అభిమానులు సోషల్ మీడియా ద్వారా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసారు. తమ అభిమాన హీరో ఆరోగ్యం ఎలా ఉంది అంటూ ఆరాలు తీశారు.
అయితే కార్తీ ఆరోగ్యం పట్ల ఎలాంటి భయాలు పెట్టుకొనవసరం లేదని, జరిగింది చిన్న ప్రమాదమే అని, కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటే సెట్ అయిపోతుందని డాక్టర్లు చెప్పుకొచ్చారు. దీంతో అభిమానులు కాస్త శాంతించారు. ఇకపోతే కార్తీ, పీఎస్ మిత్రన్(PS Mithran) కాంబినేషన్ లో గతంలో ‘సర్దార్’ అనే చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ స్టేటస్ ని సొంతం చేసుకుంది. ఆరోజుల్లోనే వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా తెలుగు లో కూడా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సర్ప్రైజ్ హిట్ గా నిల్చింది. అలాంటి చిత్రానికి సీక్వెల్ అంటే కచ్చితంగా అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండడం సహజం. ‘సర్దార్ 2’ పైన కూడా అలాంటి అంచనాలే ఉన్నాయి. నీటి సమస్యలపై, వాటిపై ప్రముఖ వ్యాపారవేత్తలు ఎలాంటి వ్యాపారాలు చేస్తున్నారు అనే అంశం గురించి కళ్ళకు కట్టినట్టు చూపించారు మేకర్స్.
ఇందులో కార్తీ డ్యూయల్ రోల్ లో కనిపించాడు. రెండు క్యారెక్టర్స్ లో కూడా ఆయన ఎంతో అద్భుతంగా నటించాడు. పార్ట్ 2 లో కూడా డ్యూయల్ రోల్ ఉంటుంది. మొదటి భాగం లో రాశి ఖన్నా(Raashi Khanna) హీరోయిన్ గా నటిస్తుండగా, రెండవ భాగం లో హీరోయిన్ గా మాళవిక మోహనన్(Malavika Mohanan) నటిస్తుంది. అయితే ఈ హీరోయిన్స్ ని మార్చేయడం తో ఈ సినిమా మొదటి భాగానికి కొనసాగింపుగా ఉంటుందా?, లేకపోతే ప్రత్యేకమైన చిత్రమా? అనేది తెలియాల్సి ఉంది. శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటున్న ఈ సినిమాని సమ్మర్ లో విడుదల చేయాలని అనుకున్నారు. ఇప్పుడు కార్తీకి ప్రమాదం జరగడంతో వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఈ సీక్వెల్ ఆడియన్స్ ని ఎంతవరకు అలరిస్తుంది అనేది. ఈ చిత్రంతో పాటు కార్తీ ‘వా..వాతియార్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమానే ముందుగా విడుదల అయ్యేట్టు ఉంది.
Also Read : ‘పుష్ప’ కి మరో స్టార్ హీరో ఫిదా.. ఎందుకు అందరూ పుష్ప పై పడ్డారు ?
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Karthi seriously injured shooting hospital update
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com