IND Vs AUS: ప్రాక్టీస్ మ్యాచ్లో గిల్ చేతి వెలికి గాయమైంది. దీంతో అతడు తొలి టెస్ట్ కు దూరమయ్యాడు. ఫలితంగా అనూహ్యంగా దేవదత్ పడిక్కల్ కు అవకాశం లభించింది.. ఇప్పటివరకు దేవదత్ ఒక్క టెస్ట్ మాత్రమే ఆడాడు. అతనికి గనుక పెర్త్ టెస్టుల్లో అవకాశం ఇస్తే పెను సంచలనమే. ఇప్పటివరకు దేవదత్ 40 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడాడు. 2677 రన్స్ చేశాడు.. భారత – ఏ జట్టు తరఫున ఆస్ట్రేలియా – ఏ జట్టు తో జరిగిన మ్యాచ్లో హైయెస్ట్ స్కోర్ చేశాడు. అతడు గనుక అదే ఫామ్ కొనసాగిస్తే టీమ్ ఇండియాలో స్థానం సుస్థిరమవుతుంది.
వారిద్దరి మధ్య పోటాపోటీ
2022 -23 రంజి సీజన్లో జురెల్ ఉత్తర ప్రదేశ్ స్టేట్ తరఫున నాగాలాండ్ జట్టుపై 249 రన్స్ చేశాడు. ఐపీఎల్ లో కూడా అదే జోరు కొనసాగించాడు. అంతేకాదు ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లాండ్ జట్టుతో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్ లో అద్భుతంగా ఆడాడు. వేగంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం దక్కించుకున్నాడు. ఇరానీ ట్రోఫీలో ముంబై జట్టుపై 93 రన్స్ చేశాడు. ఆస్ట్రేలియా వేదికగా ఆస్ట్రేలియా – ఏ జట్టుతో జరిగిన అనధికారిక మ్యాచ్లో భారత – ఏ జట్టు తరఫున అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. రెండవ అనధికారిక టెస్ట్ లో 80, 68 రన్స్ చేశాడు.. పంత్ ను మరిపించే విధంగా ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఒకానొక సందర్భంలో స్పెషలిస్ట్ కేటగిరిలో ఇతడిని బ్యాటర్ గా తీసుకోవాలని డిమాండ్లు కూడా వస్తున్నాయి.
పేస్ బౌలర్లకు కూడా
ఆస్ట్రేలియా మైదానాలు పేస్ బౌలింగ్ కు అత్యంత అనుకూలంగా ఉంటాయి. అందువల్లే బుమ్రా, సిరాజ్, ఆకాష్ దీప్, ప్రసిద్ క్రిష్ణ వంటి వారికి అవకాశం లభించింది. వీరితోపాటు హర్షిత్ రాణాకు కూడా చోటు దక్కింది. నితీష్ కుమార్ రెడ్డి కూడా ఆల్రౌండర్ కేటగిరిలో స్థానం లభించింది. ఒకవేళ సీనియర్ ఆటగాళ్లు గాయపడితే మిగతా యువ ఆటగాళ్లకు అవకాశాలు లభిస్తాయని తెలుస్తోంది. నితీష్ కుమార్ రెడ్డి ఇటీవల ప్రాక్టీస్ మ్యాచ్లలో విఫలమైనప్పటికీ.. అంతకుముందు జరిగిన సీరియస్లలో అతడు అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించాడు.. మరోవైపు హర్షిత్ రాణా సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. దిగువ లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ లోకి వచ్చి ఇటీవల రంజీ ట్రోఫీలో అద్భుతాన్ని సృష్టించాడు. ఏకంగా రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 43 వికెట్లు ఇప్పటివరకు సాధించాడు. 469 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. ఇక దులీప్ ట్రోఫీలో నాలుగు వికెట్లను రెండుసార్లు పడగొట్టాడు. రంజి ట్రోఫీ లోనూ హాఫ్ సెంచరీ తో పాటు ఐదు వికెట్లను పడగొట్టాడు. ఇక వీరు మాత్రమే కాకుండా సాయి సుదర్శన్, రుతు రాజ్ గైక్వాడ్ కూడా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నారు. వీరికి అవకాశాలు లభించడం కష్టమే అయినప్పటికీ.. ఒకవేళ సీనియర్ ఆటగాళ్లు గాయపడితే.. వీరిని అప్పటికప్పుడు జట్టులోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.