https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : సంచాలక్ గా మాస్టర్ మైండ్ అనిపించుకున్న గౌతమ్.. కానీ బిగ్ బాస్ టీం గౌతమ్ ని మోసం చేస్తుందా?

ఈ సీజన్ లో వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా అడుగుపెట్టి, టైటిల్ విన్నింగ్ రేస్ లోకి అడుగుపెట్టిన గౌతమ్ ని చూసి, హౌస్ లో ఉన్న ప్రతీ ఒక్కరు కుళ్ళుకుంటున్న సంగతి మన అందరం చూస్తూనే ఉన్నాం.

Written By:
  • Vicky
  • , Updated On : November 22, 2024 / 08:33 AM IST

    Gautham seems to be the mastermind as Sanchalak.. But will the Bigg Boss team cheat Gautham?

    Follow us on

    Bigg Boss Telugu 8 : ఈ సీజన్ లో వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా అడుగుపెట్టి, టైటిల్ విన్నింగ్ రేస్ లోకి అడుగుపెట్టిన గౌతమ్ ని చూసి, హౌస్ లో ఉన్న ప్రతీ ఒక్కరు కుళ్ళుకుంటున్న సంగతి మన అందరం చూస్తూనే ఉన్నాం. కేవలం కంటెస్టెంట్స్ కి మాత్రమే కాదు, బిగ్ బాస్ కి కూడా గౌతమ్ కి క్రేజ్ పెరగడం అసలు ఇష్టం లేనట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకు ఉదాహరణ నేడు జరిగిన రోప్స్ టాస్క్. బిగ్ బాస్ టీం ఇంతకంటే దారుణంగా ఎప్పుడూ, ఏ సీజన్ లో కూడా ప్రవర్తించి ఉండదు. హాట్ స్టార్ లైవ్ లో చూసిన ప్రతీ ఒక్కరికి బిగ్ బాస్ ఎంత దారుణమైన మోసం చేసాడో అర్థం అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే రెండు బ్లూ, మూడు రెడ్ టేబుల్స్ మీద కంటెస్టెంట్స్ నిలబడాలి. వీళ్లంతా పైన ఉన్న రోప్స్ ని పట్టుకోవాలి. సంచాలక్ వద్ద బ్లూ, రెడ్ కలర్స్ తో కూడిన ఒక ‘థైస్’ ఉంటుంది.

    ఆ ‘థైస్’ ని రోల్ చేసిన ప్రతీ సారి ఏ కలర్ అయితే వస్తుందో, ఆ కలర్ మీద నిల్చున్న కంటెస్టెంట్ టేబుల్ ని లాగేయాలి. లాగేసిన తర్వాత సదరు కంటెస్టెంట్ క్రిందకి కాళ్ళు పెట్టకుండా, గాల్లోనే తేలుతూ ఉండాలి. పక్కనే మరో టేబుల్ ఉంటే దాని మీదకు కూడా షిఫ్ట్ అవ్వొచ్చు. ఎవరైతే కాళ్ళు నెలకి ఆణిస్తారో, వాళ్ళు ఈ టాస్క్ నుండి అవుట్ అవుతారు. ఈ టాస్క్ కి సంచాలక్ గా గౌతమ్ ని పెడుతాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో సంచాలక్ కి ఇష్టమొచ్చిన కంటెస్టెంట్స్ ని పీకి అవతలేసే ఛాయస్ ఉంటుంది. గ్రూప్ గేమ్స్ కి వ్యతిరేకంగా ఉండే గౌతమ్ కచ్చితంగా రోహిణి, టేస్టీ తేజ ని సేవ్ చేస్తాడు, అప్పుడు అతన్ని ఒక రేంజ్ లో నెగటివ్ చేయొచ్చు, అతని గ్రాఫ్ ని తగ్గించొచ్చు అనే నీచమైన ప్లాన్ వేసాడు బిగ్ బాస్.

    దీనికి గౌతమ్ తన తెలివి తో బిగ్ బాస్ వేసిన ప్లాన్ ని తిప్పికొట్టాడు. ‘థైస్’ మీద ఉన్న ఆరు రంగుల మీద కంటెస్టెంట్స్ కి సంబంధించిన పేర్లు రాసాడు గౌతమ్. ‘బ్లూ’ కలర్ టేబుల్ మీద రోహిణి, పృథ్వీ నిల్చుంటారు కాబట్టి డైస్ మీద ఉన్నటువంటి మూడు బ్లూ కలర్ బ్లాక్స్ మీద రోహిణి , పృథ్వీ పేర్లు రాస్తాడు గౌతమ్. ఒక బ్లూ కలర్ ఖాళీ గా ఉంది కాబట్టి, దానిపై ‘నల్’ అని రాస్తాడు. రెడ్ కలర్ టేబుల్స్ మీద తేజ, యష్మీ, విష్ణు నిల్చుంటారు కాబట్టి, ‘థైస్’ మీద ఉన్నటువంటి రెడ్ కలర్ బ్లాక్స్ పై ఈ ముగ్గురి పేర్లను రాస్తాడు. ‘థైస్’ ని రోల్ చేసినప్పుడు ఎవరి పేరు అయితే ముందు పడుతుందో, వాళ్లకు సంబంధించిన టేబుల్ ని తోసేసాడు గౌతమ్. ఇంత అద్భుతంగా ఆలోచన చేసి ఆయన సంచాలక్ గా వ్యవహరిస్తే, ఇవేమి టెలికాస్ట్ లో చూపించకుండా , కేవలం ‘థైస్’ ని రోల్ చేసేది మాత్రమే చూపిస్తాడు బిగ్ బాస్. చివరికి టేస్టీ తేజ, రోహిణి మిగులుతారు. దీనిని బట్టి గౌతమ్ గ్రూప్ గేమ్ ఆడాడు అన్నట్టుగా జనాలకు ప్రాజెక్ట్ చేసి చూపించిన తీరు అత్యంత నీచంగా ఉంది.