Ind Vs Aus : పెర్త్ టెస్టుల్లో టాస్ భారత్ గెలిచింది. బ్యాటింగ్ ఎంచుకుంది. కేవలం 150 పరుగులు మాత్రమే చేసింది. భారత జట్టులో నితీష్ కుమార్ రెడ్డి 41 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. రిషబ్ పంత్ 37, కేఎల్ రాహుల్ 26 పరుగులతో ఆకట్టుకున్నారు. మిగతా ఆటగాళ్లు దారుణమైన ఆట తీరు ప్రదర్శించారు. ప్రమాదకరమైన ఓపెనర్ యశస్వి జైస్వాల్ 0 పరుగులకు అవుట్ అయి పరువు తీసుకున్నాడు. మరో ఆటగాడు దేవదత్ పడిక్కల్ కూడా 0 పరుగులకే అవుట్ అయి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు . స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కేవలం 5 పరుగులకే అవుట్ అయ్యాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో హేజిల్ వుడ్ నాలుగు వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు. కమిన్స్, స్టార్క్, మార్ష్ తలా రెండు వికెట్లు సాధించారు.. టీమ్ ఇండియా 150 పరుగులకు అలౌట్ కావడంతో.. ఆస్ట్రేలియా నెటిజన్లు తమ వక్ర బుద్ధిని ప్రదర్శించారు. టీమిండియాను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో విచిత్ర విచిత్రమైన పోస్టులు పెట్టారు. న్యూజిలాండ్ జట్టు చేతిలో ఓడిపోయిందని.. ఇప్పుడు ఆస్ట్రేలియాపై అదే నాసిరకమైన ఆట తీరు ప్రదర్శిస్తోందని.. 150 పరుగులకే కుప్ప కూలిందని.. ఇలాంటి జట్టు ఆస్ట్రేలియా ను ఎలా ప్రతిఘటిస్తుందని కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. ఇవి సహజంగానే టీమిండియా అభిమానులకు ఇబ్బందికరంగా మారాయి. ఆస్ట్రేలియా అభిమానులు చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఎలా ఇవ్వాలో తెలియక టీమిండియా అభిమానులు నిశ్శబ్దాన్ని ఆశ్రయించారు. అయితే టీమిండియా కెప్టెన్ బుమ్రా తన బౌలింగ్ తో రెచ్చిపోవడంతో అభిమానులకు ఎక్కడా లేని ఆనందం కలిగింది.
అభిమానుల్లో ఆనందం
బుమ్రా నిప్పులు జరిగే విధంగా బంతులు వేయడంతో ఆస్ట్రేలియా బ్యాటర్లు కోలుకోలేకపోయారు. స్వదేశంలో ఆడుతున్నప్పటికీ క్రీజ్ లో ఉండేందుకు ఆపసోపాలు పడ్డారు. దీంతో టీమ్ ఇండియా అభిమానులు సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. ఆస్ట్రేలియా అభిమానులను ఉద్దేశిస్తూ విమర్శలు చేశారు. “150 పరుగులు చేస్తే విమర్శించారు కదా.. ఇప్పుడేమంటారు. ఆడుతోంది మీ స్వదేశంలో.. 67 పరుగులకే 7 వికెట్ల కోల్పోయింది.. ఇంకేం కోలుకుంటుంది.. రేపు ఉదయం మీరు వేసే సమయానికి ఆల్ అవుట్ అవుతుంది. వంద పరుగులకు మించి చేయడం కష్టమే. ఇలాంటి జట్టును పట్టుకొని మీరు గొప్ప గొప్పగా మాట్లాడారు. ఇప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకుంటారు.. ఇప్పటికైనా వాస్తవంలోకి రండి. విమర్శలు చేసే ముందు ఆలోచించుకోండి. అంతేతప్ప ఇష్టానుసారంగా కామెంట్స్ చేస్తే ఫలితం ఇలాగే ఉంటుందని” టీమిండియా నెటిజన్లు పేర్కొన్నారు. మొత్తంగా పెర్త్ టెస్ట్ తొలి రోజు జరిగిన మ్యాచ్లో టీమిండియా పై చేయి సాధిస్తే.. సోషల్ మీడియాలో కాస్త ఆలస్యంగానైనా టీమిండియా అభిమానులు అప్పర్ హ్యాండ్ సాధించారు.
Daily schedule of Jasprit Bumrah #INDvsAUS pic.twitter.com/oryPxy3QLK
— Sagar (@sagarcasm) November 22, 2024