IND Vs AUS: ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా భంగపాటుకు గురైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా టీమిండియాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. బలమైన టాప్ ఆర్డర్ ఉన్నప్పటికీ.. టీమిండియా గొప్ప స్కోరు చేయలేకపోయింది. ఆస్ట్రేలియా ఎదుట ఫైటింగ్ స్కోర్ ఉంచలేకపోయింది. బౌలింగ్ లో వికెట్లను త్వర త్వరగా నే పడగొట్టినప్పటికీ.. ఆస్ట్రేలియా జట్టులో హెడ్ భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారిపోయాడు. అతడు ఏకంగా సెంచరీ చేయడంతో టీం ఇండియాకు ఓటమి తప్పలేదు. 2011 తర్వాత మరోసారి వన్డే వరల్డ్ కప్ సాధించాలనే భారత ఆటగాళ్లు, అభిమానుల కల కల గానే మిగిలిపోయింది. ఈ క్రమంలో నాడు ఓటమి ఎదురైన నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మైదానం లో ఏడ్చేశాడు. విరాట్ కోహ్లీ నుంచి మొదలు పెడితే కోహ్లీ వరకు ప్రతీ ఒక్కరు కన్నీటి పర్యంతమయ్యారు. అప్పట్లో ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఓటమి నేపథ్యంలో భారత క్రికెటర్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఊరడించారు. ఆ తర్వాత 2024 లో జరిగిన టి20 వరల్డ్ కప్ లో భారత్ విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై గెలుపును సొంతం చేసుకుంది.
రివెంజ్ తీర్చుకుంది..
దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఆస్ట్రేలియాపై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా 2023 వన్డే వరల్డ్ కప్ లో ఎదురైన పరాభవానికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో టీమిండియా పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ క్రమంలో అభిమానులు సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు రూపొందించి టీమిండియా ప్లేయర్లను ఖుషి చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న వీడియోలో డాకు మహారాజ్ సినిమాలోని గ్లింప్స్ ను బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా ఉపయోగిస్తూ.. 2023 నాడు ఎదురైన ఓటమి.. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో దక్కించుకున్న గెలుపు తాలూకూ దృశ్యాలతో అభిమానులు ఒక వీడియో రూపొందించారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. అన్నట్టు ఇలా టీమిడియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ వెళ్లడం ద్వారా.. కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. 2023 వన్డే వరల్డ్ కప్, 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్, 2024 t20 వరల్డ్ కప్ ఫైనల్, 2025 ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ లోకి భారత జట్టును తీసుకెళ్లి.. ఈ ఘనత అందుకున్న తొలి కెప్టెన్ గా టీం ఇండియా సారథి రోహిత్ శర్మ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.
Also Read: 2023 లో ఓడించిన బాధ.. అందుకే ఆస్ట్రేలియాపై కేఎల్ రాహుల్ కసిగా ఆడాడా?
ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా పై భారత్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో డాకు మహా రాజ్ సినిమాలోని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో టీమిండియా విక్టరీని అభిమానులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. #INDvAUS #IndvsAusSemifinal #ChampionsTrophy2025 pic.twitter.com/wQPoTlwFKt
— Anabothula Bhaskar (@AnabothulaB) March 5, 2025