Ind Vs Aus 4th Test: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ సైకిల్ ముందు ఉండడంతో మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ కీలకంగా మారింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్ లో 474 పరుగులకు ఆలౌట్ అయింది. స్మిత్ 140 పరుగులు చేశాడు.. బుమ్రా మూడు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియా కడపటి వార్తలు అందే సమయానికి రెండు వికెట్లు నష్టపోయి 59 పరుగులు చేసింది. రాహుల్ 24, రోహిత్ మూడు పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్లో అవుట్ అయ్యారు. ప్రస్తుతం యశస్వి జైస్వాల్ 29, విరాట్ కోహ్లీ 2 క్రీజ్ లో ఉన్నారు.
మైదానంలోకి దూసుకొచ్చాడు
మెల్బోర్న్ మైదానంలో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సమయంలో కలకలం చోటుచేసుకుంది. టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ వైపు ప్రేక్షకుల్లో కూర్చున్న ఓ వ్యక్తి వచ్చాడు. విరాట్ కోహ్లీ లక్ష్యంగా దూసుకొచ్చాడు. దీంతో ఆట కొద్దిసేపు ఆగిపోయింది. దీంతో సెక్యూరిటీ సిబ్బంది మైదానంలోకి వచ్చారు. వెంటనే అతడిని బయటకి తీసుకెళ్లారు. వాస్తవానికి ఆ వ్యక్తి ముందుగా రోహిత్ శర్మ వైపు వచ్చాడు. దీంతో భద్రత సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. అయితే వారి వద్ద నుంచి తప్పించుకొని విరాట్ వైపు వచ్చాడు. అతడిని ఆ లింగనం చేసుకోవడానికి యత్నించాడు. అయితే ఈ పరిణామం ఆటకు బ్రేక్ కలిగించింది. ఈ సంఘటన మ్యాచ్ లో కలకలం సృష్టించింది. టీమిండియా ఆటగాళ్లు ఒకసారిగా షాక్ కు గురయ్యారు. ఆ తర్వాత తేరుకున్నారు. ఎంపైర్లు మ్యాచ్ ను కొద్దిసేపు నిలిపివేశారు. ఆ తర్వాత ప్రారంభించారు..
కోహ్లీ నామస్మరణ
మెల్బోర్న్ మైదానంలో నాలుగో టెస్ట్ తొలి రోజు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సమయంలో విరాట్ కోహ్లీ, కోన్ స్టాస్ మధ్య వివాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో విరాట్ కోహ్లీ మ్యాచ్ ఫీజు నుంచి రిఫరీ 20% కోత విధించారు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజు అంటే శుక్రవారం మెల్బోర్న్ మైదానం కోహ్లీ నామస్మరణతో మారుమోగిపోయింది. మెల్ బోర్న్ మైదాన సామర్థ్యం 85,000. నాలుగో టెస్ట్ జరుగుతున్న ఈ మైదానం పూర్తిగా నిండిపోయింది. అయితే ఈ మ్యాచ్ కు హాజరైన ప్రేక్షకులు మొత్తం కోహ్లీ నామస్మరణ చేయడం విశేషం. అలా చేసిన వారిలో ఆస్ట్రేలియా అభిమానులు కూడా ఉండడం గమనార్హం. అభిమానులు తన పేరును పదేపదే ఉచ్చరిస్తున్న నేపథ్యంలో.. వారిని ప్రోత్సహిస్తూ కోహ్లీ కంటితో సైగ చేశాడు. చేతులతో సంకేతాలు ఇచ్చాడు.
బ్లాక్ బ్యాడ్జీలతో..
టీమిండి ఆటగాళ్లు బ్లాక్ బ్యాడ్జీలతో మైదానంలోకి దిగారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కన్నుమూసిన నేపథ్యంలో.. ఆయన మృతికి సంతాపంగా భారత క్రికెటర్లు నల్లబ్యాడ్జీలు ధరించి మైదానంలోకి వచ్చారు.
A Pitch invader Enters The Ground And Hugs Virat Kohli.
(1/5)#ViratKohli #AUSvIND #INDvAUS #BGT @imVkohli pic.twitter.com/yXEBFSWP67
— virat_kohli_18_club (@KohliSensation) December 27, 2024