https://oktelugu.com/

Ind Vs Aus BGT 2024: పెర్త్ టెస్ట్ ను ఉచితంగా ఎక్కడ చూడొచ్చంటే?

క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. మరికొద్ది గంటల్లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. భారత్ - ఆస్ట్రేలియా జట్లు పెర్త్ లోని ఆప్టస్ స్టేడియంలో జరిగే తొలి టెస్ట్ మ్యాచ్ లో తలపడనున్నాయి.

Written By: Anabothula Bhaskar, Updated On : November 21, 2024 10:44 am
Ind Vs Aus BGT 2024(1)

Ind Vs Aus BGT 2024(1)

Follow us on

Ind Vs Aus BGT 2024: 2014-15 సీజన్ లో ఆస్ట్రేలియా జట్టు చివరిసారిగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలుచుకుంది. 2018-19, 2020-21 సీజన్లో భారత్ చారిత్రాత్మక విజయాలతో సహా నాలుగు సిరీస్ లను భారత్ సాధించింది.. దీంతో ఆతిథ్య జట్టు దశాబ్ద కాలంగా చూస్తున్న ఎదురుచూపుకు చెక్ పెట్టాలని భావిస్తున్నది. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా, భారత్ తొలి రెండు స్థానాలలో సాగుతున్నాయి.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో భారత్ అడుగుపెట్టాలంటే కచ్చితంగా ఐదు టెస్టుల సిరీస్ ను 4-0 తేడాతో గెలుచుకోవాలి. ఒకవేళ అన్ని కుదిరితే 5-0 తేడాతో విజయం సాధించాలి. అప్పుడు ఎటువంటి బాధర బంధీ లేకుండా భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లోకి వెళ్తుంది.. కానీ అది అంత సులభం కాదు. ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సంబంధించి రెండు సీజన్లలో భారత్ విజేతగా నిలిచింది. ఈసారి కూడా అదే తీరుగా విజయం సాధించి హ్యాట్రిక్ దక్కించుకోవాలని భావిస్తోంది. రెండు జట్లు సమఉజ్జీలుగా ఉండడంతో ఈసారి పోటీ రసవత్తరంగా సాగుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇక ఇటీవల స్వదేశం లో న్యూజిలాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్లో భారత్ దారుణమైన ఓటమి మూటగట్టుకుంది. ఏకంగా మూడు టెస్టులు ఓడిపోయి పరువు తీసుకుంది. దీంతో పర్యాటక జట్టుపై కాస్త ఒత్తిడి ఉండే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.. అయితే గత రెండు సీజన్లలో ఆస్ట్రేలియా గడ్డపై గవాస్కర్ ట్రోఫీలను భారత్ గెలుచుకున్న నేపథ్యంలో.. అదే దూకుడు ఈసారి కూడా కొనసాగిస్తుందని వారు పేర్కొంటున్నారు.. రోహిత్ తొలి టెస్ట్ కు అందుబాటులో లేకపోయినప్పటికీ..ఆ లోటును మిగతా ఆటగాళ్లు భర్తీ చేస్తారని వివరిస్తున్నారు.

మ్యాచ్ వివరాలు ఇవే

తొలి టెస్ట్ మ్యాచ్ పెర్త్ నగరం వేదికగా ఆప్టస్ స్టేడియంలో జరుగుతుంది. ఈ స్టేడియం కెపాసిటీ 61,266. శుక్రవారం నవంబర్ 22 న తొలి మ్యాచ్ మొదలవుతుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 7: 50 నిమిషాలకు ఈ మ్యాచ్ షురూ అవుతుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ఈ టోర్నీని ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. డిడి స్పోర్ట్స్ లోనూ ఈ మ్యాచ్ చూడొచ్చు. కాకపోతే దానికి ఎటువంటి సబ్ స్క్రిప్షన్ అవసరంలేదు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ లోనూ ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.

జట్ల అంచనా

బుమ్రా( కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, అభిమన్యు ఈశ్వరన్, కేల్ రాహుల్, రిషబ్ పంత్, ధృవ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, ప్రసిధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.

రిజర్వ్ ఆటగాళ్లు : ముఖేష్ కుమార్, నవదీప్ షైనీ, ఖలీల్ అహ్మద్.

ఆస్ట్రేలియా జట్టు

కమిన్స్(కెప్టెన్) స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, హేజిల్ ఉడ్, హెడ్, జోష్ ఇంగ్లిస్, లబు షేన్, లయన్, మిచెల్ మార్ష్, నాథన్ మెక్ స్వెనీ, స్టివ్ స్మిత్, మిచెల్ స్టార్క్, ఉస్మాన్ ఖవాజా.