https://oktelugu.com/

Vishwambhara: విశ్వంభర సినిమా సంక్రాంతి కి రాకపోవడానికి కారణం ఏంటి..?దానివల్ల ఈ సినిమాకి జరిగే నష్టమేంటి..?

సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. మరి చిరంజీవి లాంటి స్టార్ హీరో మెగాస్టార్ గా తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఆయన కంటూ ఉన్న ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటూ సూపర్ హీరోగా ముందుకు సాగడమే కాకుండా ప్రేక్షకుల్లో విపరీతమైన హైప్ ను క్రియేట్ చేసిన హీరోగా కూడా గుర్తింపుని సంపాదించుకున్నాడు...

Written By:
  • Gopi
  • , Updated On : November 21, 2024 / 10:36 AM IST

    Vishwambhara

    Follow us on

    Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. 70 సంవత్సరాల వయసులో కూడా యంగ్ హీరోలకు పోటీని ఇస్తూ యాక్షన్ సీన్స్ లో పాల్గొంటూ భారీ స్టెప్పులు వేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నంలో తన చాలా బిజీగా ఉన్నాడు. ఇక ఇప్పటివరకు చిరంజీవి చేసిన సినిమాలు ఒకెత్తు అయితే ఇప్పుడు చేయబోతున్న సినిమాలో మరొక ఎత్తు అనే విధంగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఆయన వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్రయత్నం చేశారు. కానీ మొత్తానికైతే ఈ సినిమాని సమ్మర్ కి పోస్ట్ పోన్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఇక దానికి గల కారణం ఏంటి అంటే దిల్ రాజు ప్రొడ్యూసర్ గా రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో వస్తున్న గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. కాబట్టి చిరంజీవి విశ్వంభర సినిమా పోస్ట్ పోన్ చేసుకోవాల్సిందిగా దిల్ రాజు చిరంజీవికి చెప్పడంతో ఆయన తన సినిమాని సమ్మర్ కి పోస్ట్ పోన్ చేసుకున్నాడు.

    మరి మొత్తానికైతే చిరంజీవి సంక్రాంతికి రాకపోవడం పట్ల అతని అభిమానులు కొంతవరకు నిరాశ చెందుతున్నారనే చెప్పాలి. అయినప్పటికీ రామ్ చరణ్ సంక్రాంతి బరిలో నిలిచాడు కాబట్టి కొంతవరకు మెగా ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకుంటున్నారనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా ఈసారి సంక్రాంతి హీరోగా నిలవాలనే ఉద్దేశ్యంతో రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాని భారీ కసరత్తులతో బరిలోకి దింపుతున్నాడు.

    మరి విశ్వంభర సినిమా సంక్రాంతికి కాకుండా సమ్మర్ కి రావడం పట్ల ఆ సినిమాకి ఏదైనా భారీగా నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయా అనే విధంగా కూడా మెగాస్టార్ అభిమానులు ఆలోచిస్తున్నారు. ఇక నిజానికైతే సంక్రాంతి సీజన్ చిరంజీవికి బాగా కలిసి వస్తుంది. చిరంజీవి సినిమా చూడడానికి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉత్సాహం చూపిస్తారు.

    కాబట్టి సంక్రాంతి పండుగకు వస్తే అతన్ని చూసి ఆనందపడే జనాలు చాలామంది ఉన్నారు. ఇక ఇప్పుడు చిరంజీవి సంక్రాంతికి రాకుండా సమ్మర్ కి రావడం వల్ల చిరంజీవి సినిమాకి కొంతవరకు నష్టం జరిగే అవకాశాలు అయితే ఉన్నట్టుగా ట్రేడ్ పండితులు సైతం వాళ్ల అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు… చూడాలి మరి సమ్మర్ కి వస్తున్న విశ్వం భర సినిమా ఎలాంటి వసూళ్లను రాబడుతోంది అనేది….