Rohit Sharma: రోహిత్ శర్మ గత ఏడాది బంగ్లాదేశ్ సిరీస్ నుంచి ఫామ్ కోల్పోయాడు. మెరుగైన ఇన్నింగ్స్ ఆడే అతడు.. క్రీజ్ లో నిలదొక్కుకోవడానికే ఇబ్బందులు పడుతున్నాడు.. పరుగులు పక్కన పెడితే.. కనీసం దూసుకు వచ్చే బంతులను కూడా ఎదుర్కోలేకపోతున్నాడు. అందువల్లే టీమిండియా వరుస ఓటములను ఎదుర్కొన్నది. గెలవాల్సినచోట చేతులెత్తేసింది. నిలబడాల్సిన చోట తడబడిపోయి పడిపోయింది. ఈ పరాభవాలకు రోహిత్ శర్మనే కారణమని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. అందువల్లే అతడిని ఐదవ టెస్టుకు దూరంగా ఉంచింది. ఐదో టెస్టుకు అతడు దూరంగా ఉన్నప్పటికీ.. గత కొంతకాలంగా ఫామ్ లో లేకపోయినప్పటికీ.. రోహిత్ శర్మ ఇప్పటికీ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా తరఫున హైయెస్ట్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు. అతడు 2019 నుంచి 2024 వరకు తిరుగులేని ఫామ్ కొనసాగించాడు. టీమిండియా ఏకంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ దాకా తీసుకెళ్లాడు. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఓడిపోవడంతో రోహిత్ కాస్త నిరాశ చెందాడు.
అతడిదే హైయెస్ట్ రికార్డ్..
రోహిత్ శర్మ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా తరఫున ఎక్కువ పరుగులు సాధించిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అక్టోబర్ 2019 నుంచి మార్చి 2024 వరకు 54 ఇన్నింగ్స్ లలో 50 యావరేజ్ తో 2,552 పరుగులు చేశాడు. ఇందులో ఒక డబుల్ సెంచరీ ఉంది. 9 శతకాలు ఉన్నాయి. బంగ్లాదేశ్ తో గత ఏడాది జరిగిన టెస్ట్ సిరీస్ లో రోహిత్ ఫామ్ కోల్పోయాడు. అది న్యూజిలాండ్ జట్టుతో జరిగిన సిరీస్ లోనూ కంటిన్యూ అయింది. ఇక ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ రోహిత్ తన దారుణమైన ఫామ్ కంటిన్యూ చేస్తున్నాడు. దీంతో అతడికి జట్టులో స్థానం కష్టమైపోయింది. అందువల్లే రోహిత్ శర్మను జట్టుకు దూరంగా ఉంచారు. ఇదే విషయాన్ని అతడితో చెప్పారు. మొహమాటం లేకుండానే రిజర్వ్ బెంచ్ కు పరిమితం చేశారు.. అయితే రోహిత్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో హైయెస్ట్ స్కోరర్ గా ఉన్నాడు. అయినప్పటికీ అతడికి జట్టులో స్థానం కల్పించకపోవడం.. కెప్టెన్సీ నుంచి సిడ్నీ టెస్ట్ కు దూరంగా ఉంచడం పట్ల రకరకాల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రోహిత్ శర్మను రిజర్వ్ బెంచ్ కు పరిమితం చేయడాన్ని అతని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి పరిణామం మంచిది కాదని వ్యాఖ్యానిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ సందర్భంగా తమ ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు.
WTC ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు టీమిండియా తరఫున రోహిత్ హైయెస్ట్ స్కోర్ చేశాడు. అక్టోబర్ 2019 నుంచి మార్చి 2024 వరకు 54 ఇన్నింగ్స్ లలో 50 యావరేజ్ తో 2552 పరుగులు చేశాడు. ఇందులో ఒక డబుల్, 9 సెంచరీలు ఉన్నాయి.#RohitSharma#TeamIndia#SydneyTest#BGT202425 pic.twitter.com/wOajK01s11
— Anabothula Bhaskar (@AnabothulaB) January 3, 2025