Ind Vs Aus 2nd Test(1)
Ind Vs Aus 2nd Test: ఇప్పటికే పెర్త్ టెస్టులో భారత్ గెలిచింది. ఫలితంగా ఐదు టెస్టుల సిరీస్లో 1-0 తేడాతో ముందంజలో ఉంది. అడిలైడ్ వేదికగా జరిగే టెస్ట్ లోనూ విజయం సాధించి సిరీస్ లో మరో బలమైన ముందడుగు వేయాలని భావిస్తోంది. ఇప్పటివరకు ఈ వేదికగా జరిగిన టెస్టులలో ఆస్ట్రేలియా గెలిచింది. ఈ మైదానంపై ఏడు పింక్ బాల్ టెస్టులు జరిగాయి. అందులో ఆస్ట్రేలియా గెలిచింది. మొత్తంగా స్వదేశంలో జరిగిన 12 డే అండ్ నైట్ టెస్టులలో ఆస్ట్రేలియా 11 గెలిచింది. ఒక దాంట్లో మాత్రమే ఓడిపోయింది. ఇక భారత్ కూడా నాలుగు గులాబీ బంతి టెస్టులు ఆడింది. దేశంలో జరిగిన మూడు టెస్టులలో మూడింటికి మూడూ గెలిచింది. ఆస్ట్రేలియాపై జరిగిన ఒక పింక్ బాల్ టెస్టులో భారత్ ఓడిపోయింది. ఇక భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇప్పటివరకు 108 టెస్టులు జరిగాయి. ఇందులో భారత్ 33 టెస్టులలో విజయం సాధించింది. ఆస్ట్రేలియా 45 టెస్టులలో ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. 29 మ్యాచులు డ్రా గా ముగిశాయి. ఒక మ్యాచ్ మాత్రం టై అయింది. 2020లో ఆడిలైట్ వేదికగా భారత్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా తొలి టెస్ట్ ఆడింది. ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్ లో 244 రన్స్ చేసింది. ఏకంగా 53 పరుగుల లీడ్ కూడా దక్కించుకుంది. కానీ అదే ఊపును రెండవ ఇన్నింగ్స్ లో కొనసాగించలేకపోయింది. ఫలితంగా 36 పరుగులకే కుప్పకూలింది. హేజిల్ వుడ్, కమిన్స్ భారత పతనాన్ని శాసించారు.
మైదానం ఎలా ఉందంటే
తొలి రోజు ఇక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఆ తర్వాత తగ్గుముఖం పడుతుందట. మ్యాచ్ కు తలయం కలిగించే విధంగా వర్షం కురవదట. బంతికి, బ్యాట్ కు ఈ మైదానం సమానంగా సహకరిస్తుందట . ప్రారంభంలో పేస్ బౌలర్లు సత్తా చాటే అవకాశం ఉంటుందట. బంతి పాతబడిన తర్వాత స్పిన్ బౌలర్లు అదరగొడతారట. మ్యాచ్ జరుగుతున్న కొద్ది బ్యాటర్లకు అనుకూలంగా మారుతుందట. అయితే క్రీజ్ లో పాతుకు పోతే బ్యాటర్లు పరుగుల వరద పారించడానికి అవకాశం ఉందట. ఈ మైదానంలో 36 పరుగులకు ఆల్ ఔట్ అయ్యి అత్యంత చెత్త రికార్డు నమోదు చేసిన భారత్.. ఈసారి విజయాన్ని సొంతం చేసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే అన్ని విధాలుగా కసరత్తులు చేసింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో ఆస్ట్రేలియా కంటే ఒక మెట్టు పైనే ఉంది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, గిల్, రోహిత్ శర్మ పై భారత అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. బుమ్రా కూడా అదరగొడతాడని సగటు భారతీయ అభిమాని ఆశిస్తున్నాడు.